Rashmika Mandanna: విజయ్‌తో పెళ్లి.. కొంచెం సమయం కావాలంటున్న రష్మిక..

By Rajesh Karampoori

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) మరోసారి తన మాటలతో సోషల్ మీడియాను కుదిపేసింది. విజయ్ దేవరకొండతో తన రిలేషన్, పెళ్లి రూమర్స్ గురించి ఎప్పటిలాగే సైలెంట్‌గా ఉన్నా, తాజాగా ఒక ఈవెంట్‌లో ఆమె చెప్పిన "పెళ్లి మీద అభిప్రాయం" వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు, సినీ వర్గాలు, సోషల్ మీడియా అంతా రష్మిక కామెంట్స్ పైనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏమన్నారంటే?

ఇటీవల రష్మిక మందన్నా .. జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయంజు నిశ్చాయమంబు రా అనే టాక్ షో పాల్గొన్నారు. ఈ షో నటుడు జగపతిబాబు "పెళ్లి అంటే నీకు ఏమనిపిస్తుంది?" అని రష్మికను ప్రశ్నాంచారు. ఆ ప్రశ్నకు రష్మిక ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది. "నువ్వే నా సూర్యుడివి, నువ్వే నా చంద్రుడివి అనే రోజులు పోయాయి. ఇప్పుడు పెళ్లి అనేది ఇద్దరు ఒక్కరయ్యే ప్రయాణం. కానీ ఆ 'ఒక్కరయ్యే' ప్రాసెస్‌లో ఒకరిపై మరొకరికి ఒత్తిడి ఉండకూడదు. ఇద్దరు ఒకరిని అర్థం చేసుకుంటూ, గౌరవిస్తూ, ప్రేమతో ముందుకు సాగినప్పుడే నిజమైన పెళ్లి అవుతుంది," అని రష్మిక చెప్పింది.


Rashmika Mandanna s Honest Views on Marriage Go Viral - Fans Link to Vijay Deverakonda

అదే కాకుండా "పెళ్లి అంటే కేవలం రింగులు మార్చుకోవడం కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర గౌరవం, ఆప్యాయత, విశ్వాసం ఉండాలి. ఒకరికి ఒకరు స్పేస్ ఇవ్వాలి. ప్రేమతో, స్నేహంతో, అర్థం చేసుకోవడంతో మాత్రమే ఇద్దరు ఒక్కరిగా మారగలరు," అంటూ ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ మాటలు ప్రేక్షకులను ఆలోచనలో పడేశాయి. ఈ వ్యాఖ్యలు వినిపించగానే ఆడిటోరియంలో చప్పట్లు మోగాయి. ఎందుకంటే సాధారణంగా గ్లామర్ ఫీల్డ్‌లో ఉండే నటీమణులు ఇలాంటి లోతైన అభిప్రాయాలు చాలా అరుదుగా వ్యక్తం చేస్తారు. రష్మిక చెప్పిన ఈ మాటలు ఆమె వ్యక్తిత్వాన్ని, ఆలోచనా పరిపక్వతను చూపిస్తున్నాయి.

'బిగ్ బాస్ హౌస్ ఏమైనా బస్సా? ఇది కోట్లాది మంది కల..’ శివాజీ దెబ్బకు రాము సైలెంట్

అంతకుముందు ఓ చిట్‌చాట్‌లో రష్మిక తన లైఫ్ పార్టనర్ గురించి మాట్లాడుతూ.. "ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా ఉన్నా కూడా నా కోసం నిలబడే వ్యక్తి కావాలి. నన్ను లోతుగా అర్థం చేసుకునే, నా భావాలు గుర్తించే మనిషి కావాలి. నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి అయితే ఎంత దూరమైనా వెళ్తాను," అని రష్మిక చెప్పారు. ఈ వ్యాఖ్యలు వినగానే అభిమానులు "ఇది స్పష్టంగా విజయ్ గురించే కదా!" అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Bigg Boss 9 Week 10th Nominations: బిగ్‌బాగ్‌లో నామినేషన్ ర‌చ్చ‌.. 10వ వారం ఎంత మంది నామినేట్ అయ్యారంటే?

ఇటీవలి కాలంలో రష్మిక, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 3న ఎంగేజ్‌మెంట్ జరిగిందని టాక్ వచ్చినా, అధికారిక ధృవీకరణ రాలేదు. అయితే, ఒక ఇంటర్వ్యూలో రష్మిక పరోక్షంగా "మీరు ఏం అనుకుంటున్నారో అదే నిజం... సమయం వచ్చినప్పుడు చెబుతా" అని చెప్పడంతో ఆ రూమర్స్‌కి మరింత బలం వచ్చింది.

Bigg Boss Buzzz:' బిగ్‌బాస్‌లో అందరూ కట్టప్పలే.. ఆమె వెన్నుపోటుతోనే: సాయి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్

మొత్తానికి రష్మిక మందన్న చెప్పిన "పెళ్లి మీద అభిప్రాయం" ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చెప్పిన ఆలోచనాత్మక మాటలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ప్రేమ అంటే గౌరవం, పెళ్లి అంటే సమానత్వం, ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది నిజమైన రిలేషన్ అని రష్మిక తన మాటలతో నిరూపించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Credit: Filmibeat

Desktop Bottom Promotion