Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
బెస్ట్ అంకుల్...బెస్ట్ ఆంట్ అవండి!

బేబీకి ఉపయోగపడే బహుమానాన్ని ఇవ్వాలి. బిడ్డపుట్టినపుడు తల్లితండ్రులు ఎంతో ఖర్చులో కూడా వుంటారు. ఇక ఏ మాత్రం అవసరానికి అందే బహుమతినిచ్చినా వారికి సంతోషమే. లౌక్యంగా అబ్బాయికి ఏమేమి వున్నాయు, ఇంకా అవసరాలేమిటి అనేది వారినే అడగాలి. ఉదాహరణకు- ఊయల కొన్నారా? అని లేదు అని వారు చెపితే మీరు ఒక మంచి ఊయల బహుమానంగా ఇవ్వటానికి సిద్ధం అవండి. ఇంకా బేబీకి అవసరమైన వాకర్స్, రాకింగ్ ఛైర్లు, పెరాంబులేటర్స్ మొదలైనవి కూడా బేబీకి అవసరమూ తల్లితండ్రులు కొనటానికి ప్రయత్నించేవే. అయితే, సన్నిహిత బంధువులు, లేదా స్నేహితులలో అయితే, గతంలో మన పిల్లలకు కొన్నటువంటి ఊయల లేదా వాకర్ వంటివి నాణ్యతగలవి వారి వినియోగానికి బహుకరించిన పరవాలేదు. పిల్లలు పెద్దవారైన తర్వాత ఈ రకం వస్తువులు మనకు ఉపయోగపడవు కనుక అవసరమున్న వారికిస్తే ప్రయోజనమే మరి. కొత్త దుస్తులు బహుకరించటం కూడా బాగానే వుంటుంది. అయితే బేబీ అతి త్వరగా ఎదిగిపోతాడనేది గుర్తించాలి. కనుక కొద్దిపాటి పెద్ద సైజు దుస్తులు కొనుగోలు చేసి బహుకరించండి.
ఇంకా ప్రత్యేకమైన బహుమతులంటే, బొమ్మలు. బంతులు, బ్యాట్లు వంటి సాధారణమైనవి ఇవ్వవద్దు. ఒక ప్రత్యేకమైన అంకుల్ లేదా ఆంటీగా వారి బ్రెయిన్ కు ఉపయోగపడే అబాకస్ వంటివి ఇవ్వండి. కొత్తగా పుట్టిన బిడ్డ వెంటనే దానిని ఉపయోగించకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడగలదు.
మరో అంశంగా, బేబే కేర్ ఉత్పత్తులైన బేబీ ఆయిల్స్, క్రీమ్స్, లోషన్స్, డైపర్స్ వంటివి కూడా బహుమానాలుగా ఇవ్వవచ్చు. జాన్సన్ అండ్ జాన్సన్ లేదా ఫిషర్ కంపెనీలు గిఫ్ట్ లు ఇచ్చేందుకు అనుకూలంగా కూడా వాటిని తయారు చేస్తున్నాయి. ఈ రకం బహుమానాలు ఇస్తే, పిల్లవాడికి మీరే బెస్ట్ అంకుల్ లేదా ఆంట్ కాగలరు.



Click it and Unblock the Notifications
