Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
పిల్లలకువచ్చే కంటి వ్యాధులకు చిట్కాలు!

1. బేబీ కంటికి పుసులు కట్టేస్తుంది - బేబీ కళ్ళు పుసులు కట్టేసి నీరు బయటకు వస్తూండటం మీరు గమనించండి. సాధారణంగా బేబీలో రోజులో కొద్ది గంటలు పడుకుంటే ఇటువంటిది జరుగుతుంది. మనంకూడా నిద్ర నుండి లేవగానే కళ్ళలో వుండే మలినాలు నీటితో కడిగేసుకుంటాం. ప్రతి కొద్ది గంటలకు బేబీ నిద్రపోయేలా బేబీ వయసు నిర్ధారించబడింది. పాపం పిల్లలు వారి కళ్ళను వారు శుభ్రం చేసుకోలేరు. కనుక మీరు ఒక మెత్తని గుడ్డతో అపుడపుడూ లేదా నిద్ర లేచినపుడు వెంటనే వారి కళ్ళను తుడవాలి.
2. కంటిలో అధికంగా నీరు రావటం - కంటిలో పుసి పట్టేయడం, నీరు అధికంగా వస్తూండటం మొదలైనవి బేబీ కళ్ళు ఇన్ ఫెక్షన్ కు గురయ్యాయంటానికి నిదర్శనం. కొన్ని సార్లు బేబీ నిద్రిస్తున్నపుడు కూడా కంటినుండి నీరు వస్తూంటుంది. ఈ పరిస్ధితిలో మీరు బేబీని పిల్లల వైద్యునివద్దకు తీసుకు వెళ్ళాలి. ఇన్ ఫెక్షన్ తీవ్రంగా వుంటే యాంటీబయోటిక్స్ వాడాలి. లేదంటే అరచేయి వేడి చేసి కంటిమీద పెడితే బేబీకి కొంత ఊరటగా కూడా వుంటుంది.
3. కొత్తగా పుట్టిన పిల్లల కళ్ళలో కొన్ని సందర్భాలలో ఎర్రని జీరలుంటాయి. కాని అది కంటి ఇన్ ఫెక్షన్ కాదు. ఇవి సాధారణంగా వుండే కళ్ళలోని రక్త నాళాలు. బేబీ బయటకు వచ్చేముందు ఒత్తిడి పొందటం వలన ఏర్పడేవే. ఒక నెలరోజులలో ఇవి పోయి కన్ను సాధారణ స్ధితికి చేరుతుంది. ఎర్ర జీరలు పోకుండా కొనసాగితే తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.
4. కొంతమంది అపుడే పుట్టీన బేబీలకు కంటీనీరును అడ్డగిస్తూ కంటిలో పలుచని పొర ఏర్పడుతుంది. అది గట్టిపడిన మ్యూకస్ కావచ్చు. లేదా కంటిలో ఏదైనా మలినం కావచ్చు. కంటి నీరు అడ్డగించబడుతూ బొట్లుగా పడుతుంది. బేబీ పెరుగుతూంటే, ఈ పొర ఆటోమేటిక్ గా తొలగిపోతుంది. కంటికి కొన్ని పరిశుభ్రతా చర్యలు చేపట్టాలి.
5. బేబీ కండ్లకలక - ఇంటిలోని వారికెవరికైనా లేదా బేబీ ఆడే పిల్లలకు ఎవరికైనా కండ్ల కలక వుంటే బేబీలకు చాలా త్వరగా సోకుతుంది. ఆందోళన చెందనవసరం లేదు. వ్యాధికి కారణం తెలుసుకొని సరైన మందులు వైద్యుని సలహాతో వాడితే కంటి కలక నయమైపోతుంది.



Click it and Unblock the Notifications
