For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భంలో వున్నది బేబీ యా? బాబా?

By B N Sharma
|

Baby
మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములుంటాయి. అంటే 46 క్రోమోజోములుగా లెక్కించాలి. ఈ 23 జతలలో 22 జతలు ఆటోజోమ్స్ గా చెప్పబడి సెక్స్ కు సంబంధించినవిగా వుండవు. ఇక మిగిలిన 23వ జత అంటే రెండు క్రోమోజోములు లింగ నిర్ధారతకు సంబంధించినవి. ఇవి 'ఎక్స్' మరియు' వై' క్రోమోజోములుగా చెప్పబడి లింగ నిర్ధారిత చేస్తాయి. పురుషుల్లో 'ఎక్స్' మరియు 'వై' క్రోమోజోములు గాను, మహిళలలో రెండూ కూడా 'ఎక్స్' క్రోమోజోములుగాను వుంటాయి.

పురుషుడి వీర్యంలో 'ఎక్స్' మరియు 'వై' క్రోమోజోములు రెండు వుంటాయి. కాని మహిళ విడుదల చేసే అండంలో ఒకే రకమైన క్రోమోజోమ్ అంటే...'ఎక్స్' మాత్రమే వుంటుంది. వీర్యంలో వున్న 'ఎక్స్' క్రోమోజోం కనుక గుడ్డును ఫలదీకరణ చేస్తే, ఏర్పడే పిండం ఎక్స్ ఎక్స్ అంటే ఆడపిల్ల. వీర్యంలోని 'వై' క్రోమోజోము అండంలోని 'ఎక్స్' క్రోమోజోం తో ఫలదీకరణ చేస్తే అది ఎక్స్ వై పిండం అంటే మగ బిడ్డ గా తయారవుతుంది.

లింగ నిర్ధారణ ...భారతీయ చట్టాలు - ఆడపిల్లలను గర్భం లోనే మరణింపజేస్తుండటంతో, మన దేశంలో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ మరియు ప్రినేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ ఆఫ్ 1994 అనే చట్టాలు లింగనిర్ధారణ చర్యలు చేయటం చట్టవ్యతిరేకమని చెపుతున్నాయి.

English summary

What determines your gender? | లింగ నిర్ధారణ ఎలా?

Human beings have 23 pairs of chromosomes, that is, 46 single chromosomes. Of these 23 pairs, 22 pairs are non-sex chromosomes —also known as autosomes.The remaining one pair forms your sex chromosomes. The sex chromosomes are the X and Y chromosomes that determine your gender. While males are made of an X and a Y chromosome, females are made of two X chromosomes.
 
Story first published:Thursday, December 8, 2011, 16:09 [IST]
Desktop Bottom Promotion