Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
పిల్లలు పుటుకతోనే సంగీత ప్రియులా?

కాని, పసి పిల్లలు సైతం సంగీత ధ్వనులు వినపడితే చాలు, నిద్రపోతున్న వారు కూడా దానికి స్పందిస్తారని, మెళకువలో వున్న పిల్లలైతే, చెవులు రిక్కించి అది ఏ దిశగా వస్తోంది? ఎలా వినిపిస్తోంది వంటి ప్రశ్నార్ధకాలతో ముఖాన్ని చాటతారని రీసెర్చి చెపుతోంది. రీసెర్చిలో వీనులవిందైన మ్యూజిక్ తరంగాలను అపుడే పుట్టిన పిల్లలకు వినిపించారట. వెంటనే వారి బ్రెయిన్ లోని కదలికలను రికార్డు చేసిన అధ్యయన కారులు ఆశ్చర్యపోయారు.
పిల్లల బ్రెయిన్ లోని కదలికలను వీరు ఎన్ సెఫలోగ్రాఫ్ అనే ఒక పరికరంతో గమనించారు. పరికరానికి సంబంధించిన ఎలక్ట్రోడ్ లను పిల్లల తలపై అమర్చారు. మ్యూజిక్ వినిపించారు. వారి బ్రెయిన్ లో అంతకుముందు విన్నది, తర్వాత వినబోతున్నది రెండూ కూడా చక్కగా పిల్లలు గమనిస్తున్నట్లు కనుగొన్నారు.
వివిధ వాయిద్యాలను వివిధ రంగులు, వివిధ రీతులలో కూడా శబ్దాలను కలిగించారు. పిల్లలు వాటిని ఎన్నో రకాలుగా వింటూ బ్రెయిన్ లో ఆనందించినట్లు తెలిపారు. బేబీలకు లయ కావాలా, శ్రావ్యత కావాలా అని కూడా వీరు పరీక్షించారు. చివరకు పిల్లలు పుడుతూనే సంగీతం వినటానికి ఆనందపడతారని తేల్చారు. అయితే మ్యూజిక్ లో వచ్చే అధిక బీట్ కు వీరు చాలా సున్నితంగా ప్రవర్తించారట. చివరకు వీరు తేల్చేదేమంటే, మనం ఈ లోకంలోకి వస్తూనే వివిధ రకాల హై , లో ధ్వనులకు అలవాటు పడిపోతామని బేబీలు తాము ఏ వాతావరణంలో వున్నారో వాటికి సంబంధించిన వివిధ పరిస్ధితులను కూడా అవగాహన చేసుకుంటారని తెలిపారు.



Click it and Unblock the Notifications
