Latest Updates
-
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.!
మహిళ రిస్కులు తగ్గించే సంతానం!

మహిళలు తాము తమ చిన్న పిల్లలతో వున్నపుడు ఎంతో జాగ్రత్తగా వుంటారు. చేసే ప్రతిపనిలోను రిస్కును అంచనా వేసి వెనుకడుగు వేస్తారు. అయితే, పురుషులు అంచనా వేసినప్పటికి ముందడుగే వేస్తారు. వెనుకడుగు వేయటానికి ఇష్టపడరు.
పురుషులు, స్త్రీలలో కల ఈ ప్రవర్తన వ్యత్యాసానికి కారణం పురుషులు తమ ఆధిక్యత, గొప్పతనం, పురుషుడననే అహంకారం వంటివి ప్రదర్శించటానికిముందుకే సాగుతాడని, అయితే మహిళ తన సంతతిని రక్షించుకోవడానికి వెనుకడుగు వేస్తుందని, ఇది సృష్టిలోనే సహజంగా వుండే లక్షణమని రీసెర్చర్లు వెల్లడించారు.
వార్విక్ యూనివర్శిటీ మరియు బేసెల్ యూనివర్శిటీలు నిర్వహించిన సంయుక్త పరిశోధనలో సైంటిస్టులు మహిళా విద్యార్ధులు జూదపు ఆటలను వారు వంటరిగా వున్నపుడు అధిక రిస్కుతోను, వారికిష్టమైన, పురుషులు లేదా పిల్లల ఫొటోలు వారితో వున్నపుడు రిస్కు తక్కువతోను ఆడటాన్ని గ్రహించారు.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, పురుషులు తాము ఒంటరిగా ఆడే సమయంలో కంటే కూడా తోటి పురుషులతో కలసి ఆట ఆడే సమయంలో మరింత అధిక రిస్కు తీసుకొని వారితో పోటీచేసే తత్వం కలిగి వుంటారని, తోటి వారికంటే అధికంగా పేరు ప్రఖ్యాతులు కలిగి వుండాలనే భావనలు కలిగి వుంటారని రీసెర్చర్లు వెల్లడించారు.
కాని పురుషులు వారివెంట కనుక ఒక మహిళ వున్నపుడు ఈ రకమైన అధిక రిస్కు తీసుకునే తత్వం ప్రదర్శించలేదని, గెలిచిన ఆటలను వారి పార్టనర్ గెలుపుగా కూడా భావించారని తెలిసింది. చేయబడిన ఈ రీసెర్చిలో పురుషులు తాము కట్టుబడిన సంబంధాలకు తక్కువ రిస్కు ప్రవర్తన కలిగి వుంటారని తోటిపురుషులతో అధికంగా తలపడరని, వారికి వారు కోరే మహిళ కనుచూపు వుంటే చాలని భావించినట్లు తెలిపారు.
అయితే, పిల్లలతో వున్నపుడు స్త్రీ, పురుషుల ప్రవర్తన అంచనాలు స్టడీ చేయటం ఇదే మొదటి సారని వార్విక్ యూనివర్శిటీ సైకాలజిస్ట్ డా. ధామస్ హిల్స్ తెలిపారు. రిస్కు తీసుకోవడంలో మన వ్యక్తిత్వ తీరు మన ప్రవర్తనను అన్ని రంగాలలోను ప్రతిబింబ చేస్తుంది. అది ఆర్ధిక అంశమైనా, వేరే అంశమైనా ఒకటిగానే వుంటుంది.
ఈ ఆటలలో మహిళ తనతోపాటు వున్నది తన సంతానం కాకపోయినప్పటికి, తనతోపాటు ఒక బేబీ వుందంటే చాలు, రిస్కు తీసుకోవటంలో విభిన్నంగా వ్యవహరిస్తుందని రీసెర్చర్లు తెలిపారు. ఈ మహిళల తీరునే వారు మహిళలలో రిస్కు తీసుకోవటంలో గల ఒక ఆన్ మరియు ఆఫ్ స్విచ్ గా వర్ణించారు. స్టడీ ఫలితాలను ఎవల్యూషన్ మరియు హ్యూమన్ బిహేవియర్ అనే జర్నల్ లో ప్రచురించారు.



Click it and Unblock the Notifications
