Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
బేబీకి ఒక సంవత్సరం వయసు వచ్చిందంటే?

చాలామంది పిల్లలు ఏడాది గడిచేటప్పటికి పడుతూ లేస్తూ నడుస్తారు కూడాను. 15 నుండి 18 నెలల వయసు వచ్చేసరికి పిల్లలు బాగానే నడుస్తారు. చేయి పట్టుకుంటే మెట్లు ఎక్కేందుకు కూడా ప్రయత్నిస్తారు. రెండు లేదా రెండున్నర సంవత్సరాలు వచ్చాయంటే పిల్లాడు పరుగు పెట్టటం, మెట్లు ఎక్కటం వంటివి చేస్తాడు. సోఫాలు ఎక్కడం, కుర్చీలు పట్టుకోవడం వంటివి చేస్తాడు. 12 నుండి 18 నెలల మధ్య పిల్లల వినికిడి పెరుగుతుంది. రెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి రెండేసి మాటలు జత చేసి మాట్టాడటం కూడా చేస్తారు. ఇక ఆ సమయంలో పిల్లలకు చిన్న చిన్న మాటలు అర్ధమయ్యేలా చెపుతూ వుండాలి.
ఈ సమయంలో ఆహారం పెట్టటం వీరికి చాలా కష్టమైన పని. పిల్లలకు వివిధ ఆహారాల రుచులు తినిపించాలి. ఆహారం వారికి 30 నిమిషాలకంటే అధికంగా తినిపించకండి. చాక్లెట్లు, కూల్ డ్రింకులు, టీ, కాఫీ వంటివి తాగించకండి. అవి బిడ్డ శరీరానికి హాని కలిగిస్తాయి. పిల్లాడు వీటిని తింటే పోషక విలువలు కల ఆహారాలు తినలేరు.



Click it and Unblock the Notifications