Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
పిల్లలలో అధికబరువు సమస్య!

లావుగా వుండే వారికి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అదనంగా వుండాలి. ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగకపోతే, టైప్ 2 డయాబెటీస్ ఖాయంగా వస్తుంది. తోటి పిల్లలు చేసే ఎగతాళికి వీరు మానసిక సమస్యలు కూడా తెనచ్చుకుంటారు. చిన్నబుచ్చుకొని తాము తక్కువ వారమని భావిస్తూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. తమను తాము ద్వేషించుకుంటారు. చిన్నతనం నుండి అలవాటయ్యే ఈ ప్రవర్తన, పెద్దవారైన తర్వాత సమాజంలో వారు సరైన రీతిలో ప్రవర్తించకుండా కూడా చేస్తుంది.
సమస్యకు పరిష్కారంగా, తల్లి గర్భవతిగా వున్నప్పటినుండే తన బరువు, బిడ్డ బరువు నియంత్రిస్తూండాలి. బరువు పెంచే ఆహారాలకంటే కూడా, పోషక విలువలు కల ఆహారాలు తీసుకోవాలి. తల్లి పాలు పట్టే దశలో కూడా బిడ్డ బరువు నియంత్రిస్తూ బరువు పెరగని ఆహారాలు మాత్రమే తినాలి. బిడ్డకు మొదటి సంవత్సరంలో ఏర్పడే కొవ్వు కణాల సంఖ్య అతనికి జీవితాంతం నిలబడి వుంటుందని పోషకాహార నిపుణులు చెపుతారు. కనుక బిడ్డలో, గేదె లేదా ఇతర రకాల పాల కారణంగా బేబీ దశలోనే శరీరంలో అధిక కొవ్వు పేరుకోకుండా బిడ్డకు ఇచ్చే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. సాధారణంగా బిడ్డలు లావెక్కి గుండుగా వుంటే, తల్లులు చూసి ఆనందపడతారు. అయితే, తర్వాతి దశలో వచ్చే ఊబకాయం వారికి అనారోగ్యం కలిగిస్తుందని గ్రహించాలి. బేకరీ ఆహారాలు, కూల్ డ్రింకులు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అందుకుగాను చిన్నతనంలో బిడ్డలకు తినిపించే ఆహారాల పట్ల అత్యంత శ్రధ్ధ వహించాలి.



Click it and Unblock the Notifications
