Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
పిల్లల ప్రవర్తనా సమస్యలు?

1. నిద్ర....బేబీ సాధారణంగా రోజుకు 20 గంటలు నిద్రిస్తుందని అందరికి తెలిసిందే. అయితే ఇది ఒక అరగంట నుండి 3 లేదా 4 గంటల వరకు కూడా వుంటుంది. కొంతమంది రాత్రిపూట చాలా లేటుగా పడుకుంటారు. పగలు బాగా నిద్రిస్తారు. వీరికి కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిదే.
2. ఏడుపే ఏడుపు...ఏడుపనేది పిల్లలకు కామన్. ఆకలికి, అలసటకు, అసౌకర్యానికి లేదంటే ఏం తోచకపోయినా సరే పిల్లలు ఏడుస్తారు. కొంతమంది పగటిపూట, కొంతమంది రాత్రిపూట ఏడుస్తూంటారు. పిల్లలు చాలా సమయం ఏడవకపోతే, పిల్లల వైద్యడిని సంప్రదించండి.
3. ఆహారం ....పుట్టిన పిల్లల ఆహారపుటలవాట్లు ప్రతిరోజూ మారతాయి. పుట్టిన వెంటనే బలవంతంగా పాలు పట్టాలి. అవసరపడితే నిద్రిస్తున్నా పాలు పట్టాల్సిందే. ఒక్కసారి తాగటం మొదలెడితే ఇక అదే కావాలని ఏడుస్తారు కూడాను. పొట్ట చిన్నదవటంచే కొద్దికొద్ది పాలు ఎక్కువసార్లు పట్టాలి.
4. చూపు....కొంతమంది పిల్లలు దేనిమీదా చూపు నిలపలేరు. వారికి కనపడేదల్లా కదలికలు, బ్లాక్ అండ్ వైట్ నీడలు మాత్రమే. మొదటి నెల తర్వాత కాని వారి కంటి కండరాలపై వారికి పట్టు రాదు. అపుడు అన్నిటిని గుర్తుపడుతుంటారు.
5. ఇతర రకాల పిల్లలు.....వీరు అంతా అర్ధం చేసుకోడానికి ప్రయత్నించేస్తుంటారు. వేళ్ళుబొటన వేళ్ళు చీకుతూంటారు. చేతులు ఆడిస్తారు. కాళ్ళు తరచుగా తన్నటం చేస్తూంటారు. ఇవన్ని సాధారణంగా కొత్తగా పుట్టిన పిల్లలలో చూస్తూనే వుంటాం. ఈ రకంగా మీ బేబీ దాని కండరాలను పెంచుకుంటూంటుంది.
చాలామంది బేబీలలో ఇవి సహజంగా వుండే ప్రవర్తనలు. పెద్దగా తేడా వస్తే తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ బేబీలు ఆహారం తీసుకోకపోయినా, యూరిన్ పాస్ చేయకపోయినా, తరచుగా ఆపకుండా ఏడుస్తున్నా దానికిగల సరైన కారణాలను తెలుసుకోండి. కొన్ని సార్లు పిల్లలు తాము చెప్పలేని ఆరోగ్య సమస్యలకు కూడా ఏడుస్తూంటారు. దానికి సరిఅయిన పరిష్కారాన్ని తెలుసుకోండి. లేదా చివరగా మీ పిల్లల వైద్యులవద్దకు తీసుకు వెళ్ళి వివరించి వారి సలహాలు పొందండి.



Click it and Unblock the Notifications
