Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మానసిక వేదనలో తల్లులు! భధ్రతలేని పిల్లలు!
ఉద్యోగాలు, ఇంటిపని, డిప్రెషన్ లేదా పేదరికం ఇతర సమస్యలు మొదలైన ఒత్తిడి దీర్ఘకాలంనుండి వుంటే, మహిళలు తమ పిల్లల విషయంలో నిర్లక్ష్యంగాను, శత్రుత్వంతోను, పట్టించుకోకుండాను వుంటారని పరిశోధకులు చెపుతున్నారు.

డిప్రెషన్ లక్షణాలున్న తల్లులు లేదా పేదరికానికి గురైన తల్లులు ఒత్తిడికి అధికంగా స్పందించడం తమ పిల్లల అవసరాలకు నిర్లక్ష్యం వహించడం చేస్తూ సమస్యలు తెచ్చుకుంటున్నారని స్టడీ చెపుతోంది.
ఒత్తిడి చర్మం కిందిపొరలలో చేరుతుందని రోచెస్టర్ యూనివర్శిటీ సైకాలజీ ప్రొఫెసర్ మెలిస్సా స్టర్జ్ ఆపిల్ వివరించారు. ఒత్తిడి అనేది మన తలలలో లేదని అది శరీరంలో మాత్రమే వుందన్నారు.
చిన్న పిల్లల సాధారణ డిమాండ్లకు అది వెంటనే స్పందిస్తుందని అవి తల్లులకు ఎంతో కష్టాన్ని కలిగించేవిగా వుంటాయన్నారు. ఒత్తిడి కి తల్లులు స్పందించే తీరు వారి గుండె చప్పుడును సైతం మార్చివేస్తోందట. స్టడీలో పరిశోధకులు 153 మంది తల్లులను వారి 17 నుండి 19 నెలల వయసున్న పిల్లలను పరిశోధించారు. మనోవేదన గల తల్లులు వారి పిల్లల పట్ల ఎంతో కఠినంగా వ్యవహరించి నట్లుగా కూడా చెప్పారు. పేదరికంలో వుండి నేర ప్రవృత్తిగల ప్రాంతాలలో వున్న తల్లులు తమ పిల్లలపట్ల వుంటే ఉదాసీనంగాను లేదా అతి చురుకుగాను కూడా ఈ రకమైన భావాలను వెల్లడిస్తున్నట్లు స్టడీ తెలిపింది. ఈ స్టడీ డెవలప్ మెంట్ అండ్ సైకోపాధాలజీ అనే జర్నల్ లో ప్రచురించారు.
మరి పిల్లల పెంపకం ఎలా ఉండాలి? పిల్లల్ని సవ్యంగా పెంచాలంటే వారితో తల్లితండ్రులు గట్టి అనుబంధం ఏర్పరచుకోవాలి. ఈ అనుబంధం వారిమధ్య ఒక మంచి సాధనంగా పనిచేస్తుంది. ప్రత్యేకించి శిశువు దశ నుండి టీన్ ఏజ్ వరకు తల్లితండ్రులకు, పిల్లలకు మధ్య ఈ అనుబంధం అవసరం ఎంతో వుంటుంది. తండ్రికి, తల్లికి అతి దగ్గరగా వున్న పిల్లలు వారు చెప్పే ఆదేశాలను ఎప్పటికపుడు ఆచరిస్తారు. ఈ బంధం కొరవడితే అవిధేయత కొట్టవచ్చినట్లు కనపడుతుంది. అదే జరిగితే, ఇక పేరెంట్ ముఖంలో పిల్లల అలవాట్లు నియంత్రించలేని అసమర్ధత కొట్టోచ్చినట్లు కనపడుతుంది.
ఈ ఒక్క అనుబంధమనే సాధనం పిల్లలు టీనేజ్ దాటినప్పటికి సమర్ధవంతంగా వారి జ్ఞాపకాలలో మిగిలిపోతుంది. పిల్లల అలవాట్ల నియంత్రణలో అన్ని సాధనాలు నిరుపయోగమైనప్పటికి అనుబంధమనే సాధనం అద్భుతంగా పనిచేస్తూనే వుంటుంది. ఇది లేని తల్లితండ్రులు ఎంతో విలువైన బంధాన్ని తమ పిల్లలపట్ల కోల్పోయినట్లే.
ఈ అనుబంధం బిడ్డ మానసిక స్ధిరత్వానికి కూడా అత్యవసరమైంది. ఇటీవలే చేసిన ఒక స్టడీ మేరకు చిన్నతనంలో తల్లితండ్రుల అనుబంధం లోపించిన పిల్లలు తమ నలభై ఏళ్ళ వయసులో కూడా కొత్త వాతావరణంపట్ల, కొత్త వ్యక్తులతో సమాజంలో మెలగటం పట్ల తీవ్ర అయిష్టాన్ని వ్యక్తం చేస్తూ ఇబ్బందులు పడతారనేది వెల్లడైంది. మరి ఈ తల్లితండ్రుల - బిడ్డల అనుబంధం ఎలా ఏర్పడుతుంది. అది బిడ్డల శిశువు దశలోనే వారి ఆలనా పాలనా చూస్తుండటంతో, శారీరక స్పర్శలతో మాత్రమే ఏర్పడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.



Click it and Unblock the Notifications