Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
బిడ్డకు ఆయాని పెట్టారా?
మంచి ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? ఒక బిడ్డ పట్ల జాగ్రత్త వహించటంకన్నా మంచిదైన ఉద్యోగం మరొకటి లేదు. కాని కొంతమంది తల్లితండ్రులు తమ బిడ్డ భాధ్యతలను వేరే వారికి అంటే ఆయాలకు, నానీలకు అప్పగించేస్తారు. మరి వారి అవసరం అటువంటిది. ఇద్దరూ ఉద్యోగస్తులైతే, ఈ పని చేయాల్సిందే మరి. కాని బిడ్డ భధ్రత, జాగ్రత్త వంటివి వారిని వేధిస్తూనే ఉంటాయి. తాము అప్పగించిన బిడ్డకు ఆయా లేదా నానీ ఎంతో జాగ్రత్తగా సేవలు చేయాలని భావిస్తారు. మరి బిడ్డలను ఈ రకంగా డే కేర్ సెంటర్లకు లేదా నానీలకు అప్పగిస్తే ఎటువంటి నష్టాలు వస్తాయనేది పరిశీలించండి.

నమ్మకం...నానీని పెట్టంగానే ఆమెను ఎంతవరకు నమ్మవచ్చు. ఎంతవరకు పిల్లవాడి బాగోగులు ఆమె చూడగలదు వంటి అంశాలు బయటకు వస్తాయి. నానీ బ్యాక్ గ్రౌండ్ ఎంత మంచిదైనప్పటికి కొన్ని పరిస్ధితులలో నమ్మకం ఏర్పడటం కష్టమే. మీరు లేనపుడు ఇంటిలో ఏం జరుగుతుందనేది తెలియదు. కొంతమంది ఆయాలు బిడ్డ తినే ఆహారంలో మత్తుమందు కలిపి బిడ్డ ఎక్కువసేపు నిద్రించేలా చేసి ఆనందిస్తారని కూడా చెపుతారు. కనుక బిడ్డ సంక్షేమానికి అన్నిటికంటే కూడా అధిక ప్రాధాన్యతనివ్వండి.
ఖర్చు - మరో నష్టం ఏమంటే, అది ఖర్చు పరంగా, ఒక నానీని బిడ్డకు పెట్టటం అంటే ఎంతో వ్యయం అవుతుంది. నానీలు చాలా జీతం తీసుకుంటారు. మీ జీతంలో చాలావరకు ఆమెకు చెల్లించవలసి వస్తుంది. కనుక మీ కెరీర్, ఉద్యోగం వంటివి జాగ్రత్త పడాలంటే మరి నానీని తప్పక పెట్టాల్సిందే. కొన్నిమార్లు పూర్తి జీతం కూడా నానీకే కేటాయించవలసి వస్తుంది. అటువంటపుడు మీ స్నేహితులకు కూడా నానీ కావలసి వస్తే, మీరు ఇద్దరు కలసి నానీ కి ఇచ్చే జీతాన్ని పంచుకోండి. కలసివస్తుంద.ి
బిడ్డ సరిపెట్టుకోగలడా - మరో అంశంగా పిల్లలు మీరు పెట్టే ఆయాలతో త్వరగా అలవాటు పడరు. వారు సరిపెట్టుకోక ఏడుస్తారు. అంతేకాక, నానీకి బాగా సరిపెట్టుకుంటే, నానీ వెళ్ళిన తర్వాత మరొకరికి సర్దుబాటు అవటం వారికి మరింత కష్టంగా కూడా ఉంటుంది. నానీ కనుక బిడ్డకు బాగా అలవాటు పడిపోతే, బిడ్డ ఆమెకు అలవాటు పడితే, ఇక తల్లి తండ్రుల వద్దకు కూడా రాడు. అటువంటపుడు తల్లితండ్రులకు బాధ కలుగుతుంది.
బిడ్డకు సమాజపరంగా - బిడ్డను డేకేర్ సెంటర్ లో చేర్పించకుండా ఇంటివద్దే ఆయాను ఏర్పాటు చేస్తే, బిడ్డకు బయటి ప్రపంచం తెలియదు. ఈ సమస్య వారు స్కూలులో ప్రవేశించినపుడు బాగా అధికమవుతుంది. ఆయాను పెట్టకుండా డే కేర్ సెంటర్ లో చేర్పిస్తే, అతనికి చాలామంది స్నేహితులు ఏర్పడే అవకాశం ఉంటుంది.
అశ్రద్ధ - ఆయా బిడ్డనను సరిగా పెంచకపోవచ్చు. బిడ్డను వదలి తాను అటు ఇటు తిరగవచ్చు. ఆయా సంరక్షణలో బిడ్డకు తిండికి, నిద్రకు ఎపుడు సమయం సరిగా దొరుకుతుందో తెలియదు. అటువంటి అశ్రద్ధలు బిడ్డకు వ్యాధులకు కూడా దోవతీయవచ్చు. బిడ్డ అనారోగ్యంపాలై చివరకు మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కనుక మీ బిడ్డను చివరకు సాధ్యమైనంతవరకు మీరే సాకటం లేదా సమీప బందువుల సంరక్షణలో ఉంచటం మేలు చేయవచ్చు.



Click it and Unblock the Notifications