Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సంవత్సరం బేబీకి ఆహారం ఎలా వుండాలి?

పిల్లల పొట్టలు చాలా చిన్నవిగా వుంటాయి. కనుక ఆ చిన్న పొట్టను పూర్తిగా పోషకాలు అధికంగా వుండే ఆహారంతో నింపాలని గ్రహించండి. అపుడే వారు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతారు. అయితే, వీరికి ఇష్టంగా తినే స్వీట్లు, కేలరీలు లేని ఆహారాలు బాగా తగ్గించండి. మీ బిడ్డ ముందుగా తనంతట తాను ఎలా తినాలా? అని పరిశోధిస్తూంటాడు. మొదటగా వేళ్ళు నోటిలో పెట్టుకుంటాడు. తర్వాత గిన్నెల వంటివి నోటివద్ద పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఈ నిపుణతలు ప్రాక్టీస్ చేయటానికి మీ పిల్లవాడికి అవకాశం ఇవ్వండి. సరిగా తినేలా నేర్పించండి.
పిల్లలు, వారంతట వారు స్వేచ్ఛగా తిండి తినటానికి చూస్తారు. కనుక మీరు వారికి కొంత నియంత్రణ కూడా నేర్పాలి. మీ పిల్లవాడి అంతర్గత ఆకలి, కడుపు నిండటం వంటి వాటికి కొన్ని హద్దులు తెలుపండి. ఏ రకమైన ఆరోగ్యకర ఆహారాలు అతను తినాలనేది మీరు నిర్ణయించండి. వాటిలో ఏది తినాలనేది, ఎంత తినాలనేది, అసలు తినాలా వద్దా అనేది మీ పిల్లవాడు ఎంచుకుంటాడు.
పాలు - పాలు పిల్లలకు ఎంతో ప్రధాన ఆహారం. వాటిలో కాల్షియం మరియు విటమిన్ డి లు పుష్కలంగా వుంటాయి. ఎదిగే పిల్లలకు గట్టి ఎముకలను ఏర్పరుస్తాయి. రెండు సంవత్సరాల లోపు పిల్లలు సంపూర్ణ ఆహారం పాలు తప్పక తాగాలి. అందులో వారి బ్రెయిన్ పెరుగుదలకు అవసరమైన కొవ్వులు కూడా లభిస్తాయి.
మీ బిడ్డ రెండు సంవత్సరాల వయసుకు వచ్చే సరికి, తక్కువ కొవ్వు, కొవ్వులేని పాలు వంటివి తీసుకోవాలి. ఈ విషయంలో వైద్య సలహా కూడా పొందండి. ఒక సంవత్సరం నుండి ఒకటిన్నర సంవత్సరాల వయసు వచ్చే సరికి వారు పాల సీసాలనుండి కప్పులు, గ్లాసులతో తాగే దశకు వచ్చేస్తారు. భోజనం అయిన వెంటనే ఒక కప్పుడు పాలు ఇవ్వటం అలవాటు చేయండి.
కొంతమంది పిల్లలకు ఆవు పాలు ఇష్టం ఉండవు. ఇవి వారి తల్లిపాలు లేదా గేదెపాలకంటే విభిన్నంగా వుంటాయి. అటువంటపుడు ఆ పాలను ఇతర పాలతో కలిపి అయినా పట్టవచ్చు. క్రమేణా ఈ మిశ్రమానికి బిడ్డ అలవాటు పడితే, తర్వాతి దశలో నూరు శాతం ఆవు పాలు పట్టవచ్చు.
పిల్లల ఆహారంలో ఐరన్ కొరత లేకుండా చూడటం ప్రధానం. ఐరన్ కొరత వుంటే అది పిల్లవాడిని శారీరకంగా, మానసికంగా నష్టపరచి, వారి ప్రవర్తన సైతం మారుస్తుంది. రక్తహీనతకు దోవతీస్తుంది.
కనుక ఐరన్ కొరత లేకుండా, ప్రతిరోజూ కనీసం ఒక గ్లాసెడు పాలు పట్టండి. వారి ఆహారంలో ఐరన్ అధికంగా వుండే, మాంసం, కోడి ఉత్పాదనలు, చేప, బీన్స్ మరియు ఇతర ఐరన్ సంబంధిత ఆహారాలు చేర్చండి. పిల్లలు ఆహారం తినేటపుడు వారి ఎలర్జీలు కూడా గమనించండి. ఆహార అలర్జీలు అంటే, గజ్జి, దురద, లేదా ఆస్తమా వంటివి గమనించి వైద్యులను సంప్రదించాలి.
పిల్లలు సరిగా తినలేని పాప్ కార్న్, కేండీలు, లేదా పచ్చి కూరలు, గట్టి పండ్లు, వంటివి పెట్టకండి. ప్రతిరోజూ మీ బిడ్డకు మూడు సార్లు లేదా మూడు ఆరోగ్యకర ఆహారాలు తినిపించండి. పిల్లలు ఆహారం సరిగా తినరని కూడా గ్రహించండి. పిల్లలు వారి కడుపులోని ఆకలికి, కడుపు నిండటానికి స్పందించేలా చేయండి. అనవసరంగా అధిక ఆహారం తినిపించి అనారోగ్యం కలిగించకండి. లేదా రోజంతా తిండి ధ్యాస వుండేలా చేయకండి.



Click it and Unblock the Notifications