Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
మీ బిడ్డ శారీరకంగా ఎదగాలంటే?

బిడ్డ బరువు తక్కువగా వున్నట్లయితే, వైద్యుడిని సంప్రదించండి. వైద్యుడు బిడ్డ శరీర బరువు, ఎత్తులను కొలుస్తాడు. వీటి ఆధారంగా బిడ్డ బరువు లోపించిన కారణాలు తెలుస్తాయి. ఒక్కొకపుడు, వంశానుగతంగాను లేదా పోషకాహార లేమితో కూడా బరువు తగ్గుతుంది. బిడ్డకు ఎక్కువ సమయాలలో కొద్ది కొద్దిగా ఆహారం ఇవ్వండి. ఒకే సారి అధికంగా ఇవ్వవద్దు. ప్రతి సారి కనీసం రెండు లేదా మూడు గంటల వ్యవధి వుండాలి. బిడ్డకు రోజులో కనీసం 6 సార్లు ఆహారాన్ని ఇవ్వవచ్చు.
పిల్లలలో సాధారణంగా ఐరన్ తక్కువగా వుండి రక్తహీనతకు లోనవుతారు. కనుక వీరి ఆహారంలో ఐరన్ అధికంగా వున్న పదార్ధాలు ఇవ్వండి. కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్, లెంటిల్స్, సోయాబీన్స్, ధాన్యాలు, గింజలు, బ్రెడ్, అన్నం మొదలైనవి ఐరన్ అధికంగా వుండే పదార్ధాలు. బరువు పెరగటానికి కేలరీలు అధికంగా వుండే ఆహారమివ్వండి. అది తగినంత శక్తి కూడా ఇస్తుంది. బిడ్డ ఎత్తును ప్రోత్సహించే చర్యలు చేపట్టండి. బిడ్డ చురుకుగా లేకుంటే సోమరియై శరీర ఎదుగుదల సహకరించదు. బయటకు తీసుకువెళ్ళి బాగా ఆడించండి.
ఆహారంలో కాల్షియం ఇస్తే అది ఎముకలను ధృఢతరం చేసి ఎత్తును పెంచుతుంది. పాల ఉత్పత్తులు కాల్షియం అధికంగా కలిగి వుంటాయి. మీ బిడ్డ పాలు ఇష్టపడకపోతే పెరుగు, వెన్న వంటివి పెట్టండి. జింక్ అధికంగా వుండే పదార్ధాలు బరువు పెంచటమే కాక ఎత్తును కూడా అధికం చేస్తాయి. చేపలు, మాంసం, పుచ్చకాయ విత్తనాలు, బఠాణీలు, డార్క్ చాక్లెట్ మొదలైనవి జింక్ అధికంగా వుండే ఆహార పదార్ధాలు.



Click it and Unblock the Notifications
