Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
పుట్టిన వెంటనే శిశువు సంరక్షణ ఎలా?

బేబీ పరిశుభ్రత -
కొత్తగా తల్లులైనవారు బేబీ గుడ్డల శుభ్రత పట్ల కొంత సమస్యగా భావిస్తారు. బేబీ సున్నిత చర్మానికిగాను మీరు బేబీకి వాడే గుడ్డలపట్ల ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. మెత్తగా, ఆకర్షణగా వున్న గుడ్డలే కాక అవి చాలా శుభ్రంగా వుండేలా చూడాలి. కొత్త తల్లులకు బిడ్డ గుడ్డలు శుభ్రంగా మరకలు లేకుండా వుంచటం కష్టమే. బేబీకి కొత్త దుస్తులు లేదా గుడ్డలు వాడేటపుడు వాటిని తప్పక వుతకండి. గుడ్డలో తయారీ సమయంలో ఏవైనా రసాయనాలుండేట్లయితే అవి పోతాయి. బేబీ గుడ్డలను వేడి నీటిలో కొంతసేపు నాన పెడితో మరకలు, క్రిములు పోతాయి.
బేబీ చర్మం చాలా సున్నితం, ఎంతో పలుచన కనుక మీరు వాడే సోప్ రసాయనాలు లేకుండా ఎంతో మెత్తనిదై వుండాలి. మైల గుడ్డలను వేరుగా వుతకండి. వేడినీటిలో నానపెట్టి శుభ్రం చేయండి.
ఉతికిన గుడ్డలను ముడుతలు, లేకుండా ఆకర్షణీయంగా వుంచటానికి ఐరన్ చేయించండి. కొద్దిపాటి సువాసన వచ్చేపదార్ధాలు కలిపినా బాగానే వుంటుంది. గుడ్డలపై మరకలను పొగొట్టటానికిగాను గంజి పెట్టండి. లేదా వినేగార్ ఉపయోగించండి. బేబీ గుడ్డలను ఐరన్ చేస్తే ఉతికిన తర్వాత వాటిలోపలి భాగాలలో వుండే క్రిములుసైతం ఆ వేడికి నశిస్తాయి. కనుక ఐరన్ చేయించటం కూడా మంచిదే.
బేబీ గుడ్డలపై ఇటువంటి చిట్కాలతో శుభ్రత పాటిస్తే బేబీకి చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా వుంటాయి.
బేబీ ధరించే దుస్తులు ఎలా ఉండాలి?
బేబీకి మెత్తటి కాటన్ గుడ్డలు ఎంపిక చేయండి. సింధటిక్ గుడ్డలైతే ర్యాషెస్ వస్తాయి.
బేబీకి కొన్న గుడ్డలు వాష్ చేసి బాగా ఎండబెట్టి తర్వాత వేయండి. డ్రాయర్ వుండి శరీరమంతా ఫుల్ గా వున్న డ్రస్ బాగుంటుంది. వేడి ప్రదేశాలలో మీరుంటే పలుచటి గుడ్డలు బేబీకి ధరింపచేయండి. అదనపు గుడ్డలు, టోపీలు పెట్టకండి. మీరుండేది చలిప్రాంతమైతే, చేతులు, కాళ్ళు పూర్తిగా కవర్ చేసే సూటు వేయండి. చలికాలంలో కాటన్ సాక్స్ వేస్తే, టోపీ పెడితే బేబీకి సౌకర్యంగా వుంటుంది. ఫ్రంట్ లో బటన్లు వుండే దుస్తులు బేబీకి వేయటానికి తీయటానికి బాగుంటాయి. ఎలాస్టిక్ వున్న దుస్తులు వాడకండి. బేబీకి డైపర్లు ప్రధానం. దీనికి గాను క్లాత్ మాత్రమే వాడండి. ఉపయోగించిన వెంటనే వాటిని తీసేయండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డలు చలికాలంలో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.



Click it and Unblock the Notifications
