Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల ఘన ఆహారం ఎప్పటినుండి?

అయితే వీరికి అదనపు ఆహారం కూడా అవసరమవుతుంది. ఈ అదనపు ఆహారంగా వారికి ఏమివ్వాలి? అనేది చాలామంది తల్లులకు సందేహంగా వుంటుంది. పిల్లలకు ఆరు నెలల వయసు పూర్తికాకముందు తల్లి పాలు తప్ప వేరే అదనపు ఆహారాన్ని అందించరాదు. అయితే, ఆరు నెలల వయసుపై బడి అదనపు ఆహారం అందించకపోతే ఎదిగే పిల్లలకు సమస్యలు వస్తాయి.
సాధారణంగా మన ప్రాంతాలలో ఆరవనెల రాగానే అన్న ప్రాసన చేయాలనే నియమం వాడుకలో వుంది. ఇది మంచి పద్ధతే. బిడ్డకు ఆరవనెలనుండి ఘన ఆహారం ఇవ్వడం మొదలు పెట్టాలి. ఈ ఆహారం తయారీ బియ్యాన్ని బాగా వేయించి, ఉడికించి మెత్తటి గుజ్జులా చేసి కొద్ది కొద్దిగా నోటికి రాయటంతో మొదలవ్వాలి. పిల్లల నోరు చాలా సున్నితం కనుక గుజ్జులా చేసిన అన్నంలో కొద్దిపాటి నెయ్యు లేదా వెన్న వంటివి చేరిస్తే అది త్వరగా వారి ఆహార వ్యవస్ధకు జీర్ణం అయ్యేలా చేస్తుంది. అయినప్పటికి బేబీ పూర్తిగా ఘన ఆహారానికి అలవాటు పడేటంత వరకు తల్లిపాలు కూడా తాగిస్తూనే వుండాలి.



Click it and Unblock the Notifications