Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
గర్భవతి తేలికగా వ్యవహరిస్తే అంతా సులభమే...!

మానసికంగా, శారీరకంగా ఎలా తనను తాను ఎదుర్కొనాలి అనే దానిపై ఆమెకు అవగాహన కావాలి. గర్భం ధరించటమనేది అకస్మాత్తుగా జరిగే చర్యకాదు. సాధారణంగా ఒక ప్రణాళిక మేరకే జరుగుతుంది. అయితే కొంతమందికి ప్రణాళిక లేకుండా కూడా గర్భాలు వచ్చేస్తాయి. ఏదైనప్పటికి మొదటినుండి మీరు తల్లి లేదా తండ్రిలా భాధ్యత తీసుకోవటానికి సిద్ధపడాలి. మన జీవితాలు ఇప్పటికే అనేక సమస్యలతో నిండివున్నాయి. మరొక బేబీ మన మధ్యకు వస్తోందంటే, ఎంతో భాధ్యత వహించాలి. కనుక ఒకప్రణాళిక కావలసిందే.
పుట్టే బిడ్డ ఆరోగ్యం తల్లితండ్రుల ఆరోగ్యంపై కూడా ఆధారపడి వుంటుంది. పురుషుడి ఆరోగ్యం మహిళ ఆరోగ్యంపై ఆధారపడి వుంటుంది. కనుక మీరు బేబీని ప్రణాళిక చేస్తే, ఇద్దరూ కూడా పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం, వంటివి మానాలి. ఆరోగ్య కర ఆహారాలు తింటూ తగిన వ్యాయామాలు కనీసం గర్భం ధరించే ముందు ఆరు నెలలపాటు చేయాలి.
సరైన అవగాహన - ఏంచేయాలి? ఏంచేయకూడదు వంటి వాటికై సరైన పుస్తకం ఒకటి కొనండి. వీలైనంతవరకు నెగెటివ్ గా వుండే ఆలోచనలకు సంఘటనలకు పోకండి. అవి మీ మైండ్ నను వ్యతిరేక దిశగా తీసుకువెళ్ళి అపాయం కలిగిస్తాయి. బిడ్డ ఆనందంగా, ఉత్సాహంగా మన మధ్యకు రావటం ప్రధానం.
మానసిక ఆరోగ్యం - మీ మదిలో జరిగే ఆలోచనలు మన చిన్నమెదడుకు చేరి అక్కడనుండి గర్భంలోని బిడ్డకు కూడా చేరే అవకాశం వుంటుంది. అంటే మీరు సంతోషంగా వుంటే అది బిడ్డకు చేరుతుంది. ఈ భావనలు పుట్టే బిడ్డలతో ప్రభావం చూపుతాయి. గర్భం ధరించామని తెలియగానే మీకు ఆనందం కలిగించే పనులు చేయండి. పుస్తకాలు చదవటం, వ్యాయామాలు ఏవైతే ఆనందింపచేస్తాయో అవి చేయాలి.
పాజిటివ్ గా వుండండి - మీరు సంతోషంగా వుండటానికి నిర్ణయం చేసుకోవాలి. ఈ భావన మీ గర్భ ధారణ, డెలివరీ వంటివి తేలిక చేస్తాయి. గర్భ ధారణే ఆనందకర విషయమని గుర్తించండి. అనవసర ఆలోచనలతో ఆందోళన చెందకండి. మీలో జరిగే మార్పులను ఆహ్వానించండి. బిడ్డతో ప్రేమ సంబంధం కలిగి వుండాలంటే, ముందు మీకు మీరు ప్రేమించుకోవాలి. మీ సామర్ధ్యాల మీద మీరు నమ్మకం కలిగి వుండి చక్కటి బిడ్డను కనండి.
తేలికగా వ్యవహరించాలి - చాలామంది మహిళలు గర్భధారణ, ప్రసవం అంటే ఎంతో ఒత్తిడి తీసుకుంటారు. నేటి రోజులలో అన్ని సౌకర్యాలు అతి తేలికగా ఏర్పడి మీ ప్రసవం తేలికగా జరిగిపోతుంది. ఏ సమస్య వచ్చినప్పటికి పరిష్కారమనేది వుంటుందని నమ్మండి. చాలామంది అనవసర ఆందోళన పడి హాని కలిగించే ఒత్తిడికి గురవుతారు. కనుక మీరు చేయవలసిందల్లా, ఒత్తిడి తగ్గించుకొని ప్రతి అంశం తేలికగా తీసుకోవాలి. అంశాలు ఎప్పటికపుడు వాటంతటవే జరిగిపోతూంటాయి. ఇతరులు చెప్పే ఖచ్చిత ప్రమాణాలకు మీరు ఆందోళన చెందకండి. మీకు మీరు జాగ్రత్త వహించండి. అంతేగానీ ఆపదలను చుట్టుముట్టనీయకండి.



Click it and Unblock the Notifications
