Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఎక్కడైనా...? ఎప్పుడైనా...? అందుకు రెడీ!
చాలామంది తల్లులు తమ బేబీలు రాత్రివేళ సరిగా నిద్రించటంలేదని అంటూ వుంటారు. పుట్టిన బిడ్డలు రాత్రులందు సరిగా నిద్రించకపోతే, కొత్త తల్లి తండ్రులకు ఆందోళనగానే వుంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా మీరు బేబీని పడుకోపెట్టిన స్ధలం సౌకర్యవంతంగా వుందా లేదా అనేది చూడండి. బేబీని ఊయలలో పడుకో పెట్టటం పాశ్చాత్య పద్ధతి. మన హిందూ సంప్రదాయం మేరకు బేబీని తల్లితండ్రులతో పాటు పడకలోనే నిద్రింప చేయాలి. ఈ రెండు పద్దతులకు కూడా కొన్ని కొన్ని లాభాలు, నష్టాలు లేదా అసౌకర్యాలు వున్నాయి. అవి ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.

మీ బేబీ ఎక్కడ నిద్రించాలి?
1. బేబీని మీ పక్కలో పడుకోపెట్టుకుంటే, కొన్ని ప్రయోజనాలున్నాయి. బేబీకి ముందు మీ పక్కన తగిన వెచ్చదనం లభించి ఆనందంగా నిద్రిస్తుంది. తల్లి పక్కన పడుకోవటం బేబీకి ఎంతో సౌకర్యంగా భావిస్తుంది. ఇంచుమించుగా బేబీకి తల్లి గర్భంలో వున్నట్లే భావిస్తుంది.
2. రెండవ ప్రయోజనంగా, బేబీకి ఏ అవసరం ఉన్నా మీరు తక్షణం తీర్చవచ్చు. బేబీ పుట్టటం మీ అదృష్టం. కాని ప్రతిసారి లేచి ఆమె సౌకర్యం చూడటం కష్టం. కనుక ఆమె మీకు దగ్గరగా వుంటే, మీరు లేవకుండానే ఆమె అవసరాలను తీర్చవచ్చు. ఏడిస్తే, వెంటనే మీరు జో కొట్టి నిద్రింపజేయవచ్చు. ఈ రకంగా తల్లి బిడ్డల నిద్ర మెరుగు అవుతుంది.
3. మూడవ ప్రయోజనంగా కలసి నిద్రించటం అవుతుంది. తల్లి శరీర గడియారం, బిడ్డకు సర్దుబాటు అవుతుంది. తల్లి బిడ్డ ఇద్దరూ కలసి నిద్రిస్తే, ఏ ఆటంకంలేని నిద్రగా వుంటుంది. ఒకే సారి వారు నిద్రనుండి హాయిగా లేస్తారు.
4. బేబీని ఊయలలో పడుకో పెడితే కూడా కొన్ని లాభాలున్నాయి. బేబీ నిద్రించటానికి స్ధలం ఎక్కువగా వుంటుంది. కాళ్ళు , చేతులు బాగా చాపుకొని పడుకోవచ్చు.పైగా ఊయల లోతుగా వుండటంతో పాకే బేబీకి చాలా సురక్సితం. బేబీ పడిపోతుందనే బెంగలేదు. మంచం అయితే, తల్లి కొద్దిగా మరిస్తే చాలు, బిడ్డ కిందపడే అవకాశం వుంటుంది.
5. మరో అంశంగా బేబీ బెడ్ లో వుంటే, తల్లి తండ్రులు సన్నిహితంగా ఉండలేరు. తల్లితండ్రులు బిడ్డ పక్కలో లేకుంటే, ఊయలలో సంతోషంగా నిద్రిస్తే, వీరు బెడ్ లో మరింత ఆనందిస్తారు.
ఒక్క మాటలో చెప్పాలంటే, బేబీ ఊయలను మీ బెడ్ రూమ్ లో ఉంచుకోండి. మీకూ కావలసినంత స్వేచ్ఛ. బిడ్డకూ కావలసినంత స్వేచ్ఛ ఉంటాయి. ఒకవైపు మీరు బేబీ భధ్రత చూసుకోవచ్చు. మరోవైపు ఆనందించవచ్చు.



Click it and Unblock the Notifications
