Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
డెలివరీ అయిన గంటకు బిడ్డకు పాలు పట్టవచ్చా?

- డెలివరీ అయిన షుమారు ఒక గంట తర్వాత తల్లిపాలు పట్టవచ్చు.
- మీ స్తనాలనుండి పాలు పట్టేటపుడు బేబీని సరిగ్గా చేతితోపట్టుకోండి. బేబీ పొట్టను మీ పొట్టకు దగ్గరగా చేర్చాలి. బేబీ గడ్డాన్ని మీ స్తనాల వద్దకు చేర్చాలి.
- మీ బేబీ నోరులో పూర్తిగా మీ స్తన మొనలుండాలి. ప్రత్యేకించి చను మొన నల్లటి భాగం నోటిలోకిపోవాలి.
- బేబీకి ఒకే స్తనం నుండి పాలు పట్టేయకండి. బేబీ ఒక స్తనం పాలు తాగిన తర్వాత నోరు తిప్పేస్తే మరో స్తనం అందించండి.
- మీ స్తన మొనలకు కొద్ది పాలచుక్కలను రాయండి. వాటిని గాలికి ఆర నివ్వండి. ఇలా చేస్తే మీ స్తన మొనలు పొడిబారి పగులకుండా వుంటాయి.
- తల్లి పాలు బాగా పడాలంటే, తగినంత నీటిని తాగాలి. వైద్యులు చెప్పిన ఆహారం తినాలి.
- బిడ్డకు పాలు పట్టేటపుడు, డాక్టర్ చెపితే తప్ప వేరే మందులు వాడకండి.
- మొదటి అయిదు నుండి ఆరు నెలల కాలం మీ బేబీ తల్లిపాలపైనే చక్కగా జీవించగలదు. వైద్య సలహాపై బిడ్డకు మెత్తటి ఘన ఆహారం పెట్టండి.
తల్లిపాలను ఎంతకాలం పట్టాలి? బిడ్డకు తల్లిపాలు మినహా 6 నెలల వరకు మరేమీ అవసరం లేదు. ఆరు నెలల తర్వాత బిడ్డకు అదనపు పోషకాహారాన్ని ఘన లేదా ద్రవ ఆహారం రూపంలో ఇవ్వాలి. మీరు ఎంతకాలం కోరితే అంతకాలం బిడ్డకు పాలు ఇవ్వ వచ్చని నిపుణులు చెపుతారు. అంతే కాని ఇంతకాలం బిడ్డకు తల్లిపాలు పట్టాలని లేదు. తల్లి ఇవ్వగలననుకుంటే బేబీ కి రెండు సంవత్సరాలవరకు కూడాపాలు పట్టవచ్చు.
ఏ పొజిషన్ లో తల్లి బిడ్డకు పాలు ఇవ్వాలి? ఇది చాలా ప్రధానం. పొజిషన్ సరి లేకుంటే బిడ్డ అధికమైన గాలిని నోటితో తీసుకునే ప్రమాదముంది. దీనితో వారికి గ్యాస్ ఏర్పడుతుంది. లేదా పాలు సరిగా తాగకుంటే బేబీ ఆకలి భావించి జబ్బు పడుతుంది. తల్లికి కూడా బిడ్డ పాలు తాగకుంటే సమస్యలుంటాయి. తల్లిపాలు పట్టేందుకు సరి అయిన విధానం - తల్లి నాలుగు విధాలుగా బిడ్డకు పాలు పట్టవచ్చు.
1. క్రెడిల్ విధానం- బేబీని క్రెడిల్ చేసి పాలు పట్టడం.
2. క్రాస్ క్రెడిల్ పొజిషన్- బేబీని ఛాతీకి అడ్డంగా పట్టుకొని పాలు పట్టడం..
3. ఫుట్ బాల్ పొజిషన్ - ఈ పొజిషన్ లో బేబీని మీ చేతిలో ఒక బంతివలే పట్టుకొని పాలు పట్టడం.
4. స్లీపింగ్ పొజిషన్ - ఈ పొజిషన్ లో తల్లి బేబీతో కింద పడుకుంటుంది. రాత్రులందు ఈ పొజిషన్ పాలు పడుతూనే బేబీని నిద్రపుచ్చటానికి కూడా పనికి వస్తుంది.
తల్లి, బిడ్డ ఆరోగ్యంగా వుండాలంటే ఈ తల్లిపాలు పట్టే చిట్కాలు ఆచరించండి.



Click it and Unblock the Notifications