Latest Updates
-
ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.! -
భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.! -
మళ్లీ మళ్లీ ప్రేమలో ఎలా పడాలి.. ప్రతిరోజూ రొమాంటిక్గా సాగేందుకు టిప్స్.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ప్రొటీన్ రిచ్ ఇడ్లీలు.. మినప్పప్పు, రవ్వతో పనిలేదు.! -
మీ ఇంట్లో రోజూ చేసే ఈ 5 పొరపాట్లే షుగర్ వ్యాధికి అసలు కారణం! -
తులసి మొక్క ఇలా మారితే అశుభానికి సంకేతమా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.! -
ఈ క్యారెట్ పాయసం చేస్తే.. గిన్నెలో ఒక్క చుక్క కూడా వదలకుండా లాగించేస్తారు! -
కారు ఎక్కగానే వాంతులు అవుతున్నాయా.. ఈ రెండూ వెంట ఉంటే చాలు.. వెంటనే రిలీఫ్.! -
ఈ బఠానీ గుడ్డు మసాలా రుచి చూడండి..ఏమి టేస్ట్ రా నాయనా అదిరిపోతుందంతే..ఎలా చేసుకోవాలంటే.. -
పిల్లల్లో బలాన్ని పెంచే ’రైస్ కేక్’.. గుడ్డు, చక్కెర లేకుండా ఎంతో టేస్టీగా.!
పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించండి!

బిడ్డ ముందు పెద్దగా చదివితే....
బిడ్డకు వినికిడి, సంభాషణ అంటే ఏమిటో బోధించినవారవుతారు. కధలు, నెంబర్లు, లెట్ర్లు, రంగులు, ఆకారాలు వంటివి తెలుపండి. బిడ్డ వినటం, గుర్తుపెట్టుకోవడం, మాటలు నేర్చే నిపుణత పెంచుతారు. వారి చుట్టూ వున్న ప్రపంచంవారికి తెలియచెపుతారు.
మీరు నమ్మండి, నమ్మకపొండి వారికి ఒక సంవత్సరం లేదా మొదటి జన్మదినం వచ్చేసరికి వారు మీ భాషలో మాట్లాడేందుకు అనువైన శబ్దాలు అన్ని వినివుంటారు. మీరు పెద్దగా ఎన్ని కధలు చదివితే, అతనికి అన్ని మాటలు మాట్లాడే నైపుణ్యతకు గురిచేయబడతాడు. బేబీ బ్రెయిన్ లో మాటల శబ్దాలు పెట్టాలంటే, వారు వినాలి. రెండు సంవత్సరాలు వచ్చేసరికి, చదివేటపుడు వినని పిల్లలకంటే కూడా విన్న పిల్లలు అధిక మాటలు తెలుసుకుంటారు. మరి అంత త్వరగా వినటం నేర్చుకున్న పిల్లలు, సరైన వయసుకి చదువులకు మరింత మెరుగుగా వచ్చేస్తారు.
మీరు చదివేటపుడు మీ బిడ్డ మీ వివిధ భావాలను, మీరు వెల్లడించే శబ్దాలను గ్రహిస్తాడు. అది అతని సామాజిక తీరుకు కూడా ఉపయోగపడుతుంది. మీరు చదివేటపుడు, ఆ పుస్తకంలోని బొమ్మలు చూడటం, వేలుపెట్టి చూపటం, ముట్టుకోవడం వంటివి చేసి వాని ఆలోచనా నైపుణ్యతలు తెలుసుకుంటాడు. శబ్దాలను అనుకరిస్తూ, బొమ్మలను గుర్తిస్తూ, మాటలు నేర్చుకుంటూ భాషా పటిమ పెంచుకుంటాడు.
ఈ రకంగా బిడ్డకు పెద్దగా చదివి వినిపించటంలో ప్రధానమైనది మీకు మీ బిడ్డకు మధ్య సంబంధం, సన్నిహితం ఏర్పడి మిమ్మల్ని బాగా ప్రేమిస్తాడు. మీ గొంతు, మీ చేష్టలు అతను ఇష్టపడతాడు. చదువు అనేది నేర్చుకోదగినది అనేది అతనికి తెలుస్తుంది. అంత చిన్న పిల్లలకు పుస్తకంలో బొమ్మ అంటే ఏమిటో కూడా తెలియదు. కాని వాటిని ప్రత్యేకించి వాటి ముఖాలు, మంచి రంగులు, మొదలైనవి చూస్తారు. లాలి పాటలు పాడండి, నర్సరీ పద్యాలు వినిపించండి. అవి శిశువుకు ఎంతో హాయిని గొల్పుతాయి.నాలుగు ...ఆరు నెలల మధ్య మీ బేబీ పుస్తకాలపై బాగా ఆసక్తి కలిగివుంటుంది. బిడ్డ పుస్తకాలను పట్టుకోటానికి ప్రయత్నిస్తుంది. నోటిలో పెట్టుకోవటం, నమలటం, వాటిని కిందపడేయటం చేస్తుంది. అందుకని వాటి అట్టలు గట్టిగా వుండి, మంచి రంగులుగా కనపడేవి తరచుగా వారికి పాడే జోలపాటలు కలిగినవి మీ వద్ద ఉంచుకోండి.
మీ బిడ్డ ఆరు నుండి 12 నెలల వయసు వచ్చే సరికి, ఆ బొమ్మలను అర్ధం చేసుకుంటుంది. అంతేకాదు, కొన్ని పేజీలలోని బొమ్మలను, లేదా కొన్ని కధలను ఇష్టపడే దశకు కూడా వచ్చేస్తుంది. మీరు చదివేటపుడు, స్పందన చూపిస్తుంది. ఆ పుస్తకం తీసుకొని తాను ఆ శబ్దాలను చేయ ప్రయత్నిస్తుంది. పేజీలు తిప్పుతుంది. పేజీలను తన చిన్ని వేళ్ళతో తిరగేస్తూ, మీ వలే చదివేందుకు ప్రయత్నిస్తుంది. పుస్తకంపై మీ బిడ్డకు గల ఆసక్తిని ఆ దశలో మీరు చాలా బాగా ఆనందిస్తారు.



Click it and Unblock the Notifications