Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
బేబీ పెరుగుదలలో కొన్నిఆశ్చర్యకర విషయాలు
అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 20-30 శాతం పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారు. డబ్లూహెచ్‌ఓ ప్రకారం శిశువు 2,500 గ్రా. మరియు అంతకన్నా ఎక్కువుండాలి.పిల్లలు బరువు తక్కువగా పుట్టినపుడు వారిని పెంచడం చాలా కష్టంతో కూడుకున్న పని. వారి పెంపక వ్యయం కూడా ఎక్కువవుతుంది. ఇది ఆర్థిక స్థోమతలేనివారికి కష్టమవుతుంది. అలా పుట్టినవారిని ఎంతో జాగ్రత్తగా పెంచితేనే వ్యాధులనుండి కాపాడవచ్చు. అయినా, వారి పెరుగుదల ఒక్కొక్కసారి సరిగ్గా ఉండకపోవచ్చు. అలా జరిగే నష్టం భౌతికంగాను, మానసికంగాను రెండువిధాలా వుంటుంది. శిశువు తక్కువ బరువుతో పుట్టినపుడు వారిని తక్కువ బరువున్న పిల్లలుగా నిర్థారిస్తారు. పట్టణాల్లో 18-20 శాతం ఉంటే పల్లెల్లో 26-30 శాతం వరకూ ఇలా తక్కువ బరువుతో పిల్లలు పుడుతున్నారు.
ఆరోగ్యకరమైన శిశువు పుట్టినప్పుడు 2.5 నుంచి 4 కేజీల బరువు ఉంటుంది. భారతీయుల విషయానికి వస్తే గరిష్ట బరువు 3.5 కేజీలు. ఐదవ నెల నిండేసరికి పిల్లలు... పుట్టిన నాటికి ఉన్న బరువుకు రెండింతలు అవుతారు. ఏడాది నిండేసరికి మూడింతలవుతారు. మొదటి నెల నుంచి మూడవ నెల వరకు సరాసరిన నెలకు 800 గ్రాముల నుంచి కేజీ వరకు బరువు పెరుగుతారు. ఏడు నుంచి పన్నెండు నెలల వరకు నెలకు 250 గ్రాముల చొప్పున పెరుగుతారు. ఏడాది దాటినప్పటి నుంచి యౌవన దశ (14-15 ఏళ్లు) వచ్చేవరకు ఏడాదికి సరాసరిన ఒకటిన్నర నుంచి రెండు కిలోల బరువు పెరుగుతారు.

ఇక ఎత్తు విషయానికి వస్తే...
పుట్టినప్పుడు పిల్లలు సాధారణంగా 50 సెంటీమీటర్ల పొడవుంటారు.
ఆరు నెలలు నిండేసరికి 66 సెంటీమీటర్లు, ఏడాది నిండేటప్పటికి 75 సెంటీమీటర్ల వరకు పెరుగుతారు.
ఏడాది నిండినప్పటి నుంచి యౌవన (ఫ్యూబర్టీ) దశ వరకు ఏడాదికి ఐదారు సెంటీమీటర్లు పెరుగుతారు.
సాధారణ పురోగతి ఇలా...
6-8 వారాల వయసులో పలకరింపుగా నవ్వడం, ‘ఊ'కొట్టడం
మూడు నెలల వయసులో మెడ నిలపడం
నాలుగైదు నెలలకు బోర్లా పడడం, పాకడం
ఆరు-ఏడు నెలలకు కూర్చోవడం, తొమ్మిది నెలలకు ఎవరి సహాయం లేకుండా సొంతంగా కూర్చోవడం
పది నెలలకు దేనినైనా పట్టుకుని సొంతంగా లేచి నిలబడడం, ఏదో ఒకటి పలకడం
12-13 నెలలకు సొంతంగా అడుగులు వేయడం, చెప్పాలనుకున్న పదాలు పలకడం.



Click it and Unblock the Notifications
