Latest Updates
-
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే!
మీ పసిబిడ్డకి ఏం తినిపించటం శ్రేయస్కరం?
తల్లిగా మీ బిడ్డ పోషకాహారం గూర్చి మీరు చింత చెందటం సహజమే. పసివయసులో పిల్లలు ఆహారం తీసుకోవటంలో అసలు శ్రద్ధ చూపించరు.ఆ సమయంలో ఎక్కువ విశ్రాంతి లేకుండా ఉండి, తిండి విషయంలో కూడా అల్లరి చేస్తారు. మీ పిల్లలకి మరి ఏం తినిపించాలి? చిన్నబిడ్డలకి పోషకాలు పుష్కలంగా ఉండే ఏం పదార్థాలు పెట్టాలి అని ఆలోచిస్తుంటారు?
పిల్లల విషయంలో ఆహారం గూర్చి తల్లిదండ్రులు సులభంగా తప్పుమార్గం పట్టే అవకాశం ఉంది. అందులో ఒకటి భోజన సమయంలో పిల్లలకి ఎక్కువ స్వేచ్చనివ్వటం. వారు తినకుండా తప్పించుకోటానికి మార్గాలు వెతుకుతుంటారు. అలా వారికి తినిపించటానికి వారి వెనకాల పరిగెత్తడమో, టివిపై ఆధారపడటమో చేయాలి.

మరో చెడ్డ అలవాటు వారికి నచ్చినట్టుగా తినిపించడం. ప్రతి బిడ్డకి మిగతావారికన్నా వారికి నచ్చిన ఆహారం,విధానం ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలు అసలు తినకపోవటం కన్నా నచ్చిన పద్ధతిలో తినటం మంచిదని అదే చేస్తారు.
ఇది అతిపెద్ద తప్పిదం. ఇలా చేయటం వల్ల, మీరు మీ బిడ్డకి అవసరమైన పోషకాలు ఉండే ఆహార పదార్థాలనుండి దూరం చేస్తున్నారు. మేము ఈ వ్యాసంలో మేము మీ బిడ్డకి అవసరమైన పోషకాలుండే ఆహారాలని పొందుపరిచాం. వీటి గూర్చి తెలుసుకోవడం వల్ల మీరు మీ బిడ్డకి సరైన ఆహారాన్ని అవసరమైనంత నిర్ణయించుకోగలరు. ఇదిగో ఇవే మీరు మీ బిడ్డకి తినిపించగలవి. ఇంకా తెలుసుకోడానికి చదవండి.
పిండిపదార్థాలు
మీ పిల్లలకి ప్రతీపూటా భోజనంలో పిండిపదార్థాలు ఉండేట్లా చూసుకోండి. ఇవి బంగాళదుంపలు, చామదుంపలు, అన్నం, గోధుమలు, అరటికాయలు, కంద మొదలైనవి. ఇవి చిన్నపిల్లలకు కార్బొహైడ్రేట్లు అందించి శక్తిని అందిస్తాయి. పిల్లల ఆహారం మొత్తం పీచుతో నిండిపోకుండా చూడండి. మంచిదైనా ఇది తొందరగా కడుపు నిండేట్లా చూసి ఆకలిని తగ్గించి మిగతా అవసరమైన పోషకాహారం తీసుకోకుండా చేస్తాయి.

పండ్లు మరియు కూరగాయలు
పండ్లు మరియు కూరలు మీ బిడ్డ శరీర ఎదుగుదలకు చాలా అవసరం.మీ పిల్లలు ప్రతి రుతువులో వచ్చే వివిధ పండ్లు, కూరలు తప్పనిసరిగా తినేట్లు చూడండి. మామిడి, అవకాడో, అరటిపళ్ళ వంటి వాటికి వండాల్సిన అవసరం కూడా లేదు; అదేవిధంగా దోసకాయలు, టమోటాల వంటివి కూడా నేరుగానే తీసుకోవచ్చు. ఇతర పండ్లు మరియు కూరలను ఉడికించి మీ పిల్లలకు పెట్టవచ్చు. మీ బిడ్డ మసాలాదినుసులు తినగలిగితే, మిగతా కుటుంబం తినేదే వారికీ పెట్టవచ్చు. పసిపిల్లలకి ఇది మంచి పోషకాహారాల్లో ఒకటి.

ఐరన్ ,ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం
మీ బిడ్డకి అధికంగా ప్రొటీన్లు,ఐరన్ ఉండే ఆహారం అవసరం. ధాన్యాలు,పప్పుదినుసులలో ఐరన్,ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీ పిల్లలకు మీరు మాంసాహారం తినిపించాలనుకుంటే,అవి తాజాగా,శుభ్రంగా ఉండేట్లు చూసుకోండి. బాగా వండి అప్పుడు తినిపించండి.అనవసర నూనెలు,ఉప్పు కలిగిఉండే ప్రాసెస్డ్ మాంసాహారం నుండి దూరంగా ఉండండి.

పాలు మరియు పాల ఉత్పత్తులు
మీ పసిబిడ్డ ఇంకా తల్లిపాలు తాగుతూ ఉన్నట్లైతే, అతనికి మరే పాలఉత్పత్తుల అవసరం ఉండబోదు. కానీ మీ బిడ్డ బలహీనంగా కానీ, ఇప్పుడిప్పుడే తల్లిపాలు మానేసినట్లైతే మాత్రం పాలు, పాల ఉత్పత్తులను రోజుకి మూడుసార్లు అందివ్వండి. కానీ రోజు 400 మి.లీ లకి మించిన ఉత్పత్తులు లేకుండా చూసుకోండి. దానికన్నా ఎక్కువైతే మాత్రం పాలల్లో వుండే విటమిన్ ఎ వంటి పోషకాలు మీ బిడ్డకి అందకుండా పోతాయి.
కొవ్వు మరియు చక్కెరలు
కొవ్వుపదార్థాలు, చక్కెరలను చెడు ఆహారంగా పరిగణిస్తారు. మీ బిడ్డకి మంచి కొవ్వుపదార్థాలను, సహజ చక్కెర పదార్థాలను సరైన మోతాదులో అందివ్వటం మంచిది. వంటనూనె కూడా పరిమిత స్థాయిలో వాడటం మంచిదే. మీ పాప ఏడాది వయస్సు నిండాక చాలా తక్కువగా వెన్న,నెయ్యి తినిపించటం మంచిది.



Click it and Unblock the Notifications
