Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
Be Careful పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా?.. ఇస్తే, గవర్నమెంట్ తెచ్చిన కొత్త రూల్స్‌తో మీకు భారీ నష్టం తప్పదు!
ఎప్పుడైతే సోషల్ మీడియా వినియోగం, మొబైల్ ఫోన్ల వినియోగం పెరిగిందో పిల్లలందరూ ఆ ఫోన్లకే బానిస ఐపోతున్నారు. పిల్లలు బయటి ఆటలు ఆడడం మానేసి మొబైల్ ఫోన్లలో వీడియోలు చూడడం, అందులో వీడియో గేమ్స్ ఆడడం వంటివి చేస్తున్నారు. దీని కారణంగా వారిలో మెదడు పనితీరు దెబ్బతినడంతో పాటు, చదువుల్లో కూడా ఉన్నతంగా రాణించలేకపోతున్నారు. దీంతో పాటు తిండి, నిద్ర అన్నీ మానేసి ఫోన్ చూస్తున్న ఘటనలు కూడా కోకొల్లలు.
అందుకే సెంట్రల్ గవర్నమెంట్ సరికొత్త విధానాలు తీసుకురావాలనే యోచనలో ఉంది. Digital Personal Data Protection Rules 2025లో భాగంగా సరికొత్త రూల్స్ తయారు చేసింది. ఆ రూల్స్ ప్రకారం.. ఎవరైనా 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు సోషల్ మీడియాలో తన అకౌంట్ సృష్టించుకోవాలంటే కచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. ఇది కనుక అందుబాటులోకి వస్తే కచ్చితంగా పేరెంట్స్ చేతుల్లోకి పిల్లలు వెళ్తారు. అలాగే చెడు మార్గంలో ఆలోచించకుండా ఉంటుంది. అయితే ఈ నియమాలను ప్రభుత్వం ఎందుకు తీసుకురావాలనుకుంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వ్యసనం..
పిల్లలు మొబైల్ ఫోన్స్ చూడడాన్ని ఒక వ్యసనంగా అలవర్చుకున్నారు. 9 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలు రోజుకు ఆరు గంటల వరకు ఫోన్లు చూస్తున్నారని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అలాగే పిల్లలు అవుట్‌డోర్ గేమ్స్ ఆడకుండా.. కేవలం మొబైల్స్‌కే పరిమితమవుతున్నారని, దీని కారణంగా వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తేలింది. దీని కారణంగా ప్రభుత్వం ఈ నిబంధనలు అందుబాటులోకి తీసుకొస్తుందని పేర్కొంది.
చిన్నతనం కోల్పోతున్నారు..
మొబైల్ ఫోన్లలో ఎక్కువగా వీడియోలు చూడడం వల్ల పిల్లలు బయటి ప్రపంచాన్ని ఎక్కువగా చూడలేకపోతున్నారు. దీంతో పాటు తమ చిన్న తనాన్ని కోల్పోతున్నారు. చిన్న వయసులోనే పెద్ద వారికి ఎదురెళ్ళడం, వారితో గొడవ పడడం, వారిని తిట్టడం వంటివి చేస్తున్నారు. చిన్న తనంలో చేసే అల్లరి, చిన్నతనంలో ఆడే ఆటలు, చిన్న పిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ లేకుండా పెరుగుతున్నారు. అందుకే వారి నుంచి మొబైల్ ఫోన్లను దూరం చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న అడల్ట్రీ
మొబైల్ ఫోన్లలో వచ్చే కంటెంట్లన్నీ చాలా వరకు అడల్ట్రీతో నిండి ఉంటాయి. వ్యూస్, రీచ్ కోసం దేనికైనా తెగించే వాళ్ళున్నారు. దీని కారణంగా పిల్లలు చెడిపోతున్నారు. ఆ రీల్స్‌ను అవలంబించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో వారిలో అనుకోని చెడు శక్తి పెరిగిపోతుంది. దీంతో పాటు బూతులు మాట్లాడడం, శృంగారం పట్ల ఆసక్తి పెరిగిపోవడం, రేప్ వంటి వాటివైపు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నట్లు తేలింది. అందుకే ఈ కఠినమైన నిర్ణయాలను తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకే ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.



Click it and Unblock the Notifications