కవలపిల్లలు కావాలనుకొంటున్నారా..? అయితే ఇవి తప్పక తినండి..

ప్రస్తుత కాలంలో చాలామంది జంటలు ఒకేమారు ఇద్దరు పిల్లలను అంటే కవల పిల్లలను కనేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రకమైన కోర్కెలు వారిలో బాగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం నేడు మహిళలు చాలావరకు ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక ఆ ఉద్యోగంలో మేటర్నీటీ లీవ్ అంటూ రెండు సార్లు సెలవు పెట్టటం మహిళ తన ఉద్యోగ భధ్రతకు, తన కెరీర్ కు ఆటంకంగా భావిస్తోంది. ఒకే సారి గర్భం ధరించి ఇద్దరు పిల్లలనను కనేయాలని భావిస్తోంది. ఆమె అవసరం అటువంటిది. కనుక, ఒకే సారి ఇద్దరు పిల్లలను కనేందుకు తప్పక మార్గాలు కూడా వుంటాయి.

కవల పిల్లలు పుడితే చాలా అదృష్టమే మరి. మరి అలా కవల పిల్లలు పుట్టాలంటే అందుకు ప్రత్యేకంగా తీసుకోవలసిన ఆహారాలు కూడా ఉన్నాయి. వీటిని కనుక తిన్నట్లైతే కవల పిల్లలు పుట్టే చాన్సెస్ అధికంగా ఉన్నాయి. అవి కనుక తింటే తప్పకుండా కవలపిల్లలు కలిగే అవకాశం ఉంది. మరి అటువంటి ఆహారాలేంటో చూద్దాం... గర్భం పొందేందుకు ప్రయత్నించే సమయంలో పాల సంబంధిత ఉత్పత్తులు, చిలకడ దుంప వంటి దుంప పదార్ధాలు అధికంగా తీసుకుంటే అవకాశాలుంటాయి.మీరు కనుక ఒకే సారి కవల పిల్లలను కనాలని అనుకుంటుంటే, ఈ చిట్కాలు బహుశ మీకు ఉపయోగించవచ్చు. కనుక ప్రయత్నం చేయండి. ఒకే సారి ఇద్దరు పిల్లలను కని ఆనందించండి.

కంద

కంద

చిలకడ దుంప: చిలకడ దుంపలో పిండి పదార్దములు ఎక్కువ, పీచుపదార్దము, విటమిన్ ఎ., సి, బి 6, ఉంటాయి. ఇరాన్, కాల్సియం కొద్దిపాటి ఉండును. దుంప కుర గా దీనిని వాడుతారు . పేరు స్వీట్ పొటాటో అయినా దీన్నీ హారంగా తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచుతుంది. యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని హార్మోన్ల స్థాయిని పెంచి ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టడానికి ఉపయోగపడుతుంది. మనిషి శరీరంలో చక్కెర శాతాన్ని నియంత్రించే అవయవం ప్లీహం. అదిఒక గ్రంథి. ఈ గ్రంథి చూడటానికి చిలకడ దుంప ఆకారాన్ని పోలి వుంటుంది. చిలకడ దుంపలలో చక్కెర శాతం అధికం. అయితే ఇవి ఈ చక్కెరను ఒక్కసారిగా రక్తంలోకి విడుదల చేయక, అతి నెమ్మది నెమ్మదిగా విడుదల చేస్తుంద. దీనివలన ప్లీహం మీద వత్తిడి తగ్గుతుంది. అందువలన చిలకడదుంపలను ఆహారంలో భాగంగా చేసుకోవడం

మంచిది.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రోడక్ట్స్ అధికంగా ఉండే వెన్న, పాలు, చీజ్, బట్టర్ మరియు పెరుగి వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ట్విన్ పుట్టడానికి బాగా సహకరిస్తాయి వీటిలో అధికంగా క్యాల్సియం ఉంటాయి. ప్రొటీన్ అధికంగా వుండే మాంసాహారాలు, చికెన్, చేప, బీన్స్, పాలు, గుడ్లు మొదలైనవి కడుపులో వున్న బేబీకి కండరాలు, జుట్టు, చేతి గోళ్ళు, ఎముకలు, బ్రెయిన్ టిష్యూలు, రక్తం మొదలైనవి ఏర్పడటానికి బాగా సహకరిస్తాయి. గర్భవతి బిడ్డ ఎముకల ఎదుగుదల, పటిష్టతలకు గాను ప్రతిరోజు సుమారు 1200 గ్రాముల కాల్షియం తప్పక తీసుకోవాలి. తాజా పాలు ఉత్పత్తులు, పాలు బాగా తీసుకుంటే ఎముకలకు అవసరమైన కాల్షియం అందుతుంది. బిడ్డ బరువు ఆరోగ్యకరంగా వుంటుంది.

ఫోలిక్ యాసిడ్(రా వెజిటేబుల్స్)

ఫోలిక్ యాసిడ్(రా వెజిటేబుల్స్)

గర్భవతి ప్రతిరోజూ తినే పోషకాహారంలో ఫోలిక్ యాసిడ్ తగినంత పరిమాణంలో తప్పని సరిగా వుండాలి. ఫోలిక్ యాసిడ్ లోపిస్తే కడుపులో వున్న బిడ్డకు శారీరక అంగవైకల్యాలు, లేదా ఇతర లోపాలు సంభవించే ప్రమాదం వుంది. ఫోలిక్ యాసిడ్ సాధారణంగా ఆచుపచ్చని ఆకు కూరలలో కావలసినంత దొరుకుతుంది. ప్రతిరోజూ తాజాగా వున్న ఆకు కూరలు వండి తింటే ఆమెకు ఈ సమస్య వుండదు. బచ్చలికూర, చుక్కకూర, తోటకూర వంటి ఉడికించిన ఆకుకూరల్లోను, కమలాపండ్లరసంలోనూ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. శారీరక అవసరాలకు రోజుకు 200 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ అవసరమవుతుంది. ఇది ఒక కప్పు ఆకులోనూ, గ్లాసు కమలాపండ్లరసంలోనూ లభిస్తుంది.

కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్

కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్

కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ కలిగినటువంటి హోల్ గ్రెయిన్స్, బీన్స్, మరియు వెజిటేబుల్స్ వంటి ఆహారాలు చాలా అద్భుతమైనటువంటి ఆహారాలు. వీటిని తరచూ తినడం వల్ల ట్విన్స్ కలిగే అవకాశం ఎక్కువ. వెజిటేరియన్ ఫుడ్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతూ శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను మెల్లగా అందిస్తాయి. అయితే నాన్‌వెజ్‌లో ఫ్యాట్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

హార్మోన్లు ఏర్పడాలంటే కొవ్వులు ఉండాలి. ఆలివ్ ఆయిల్ లో వుండే కొవ్వులు, విటమిన్ ఇ గర్భిణీ స్త్రీకి చాలా మంచిది. కనుక వీటిని సలాడ్లు లేదా ఇతర వంటకాలలో వేసి తింటే అదనపు మంచి కొవ్వు చేరుతుంది.ఆలివ్‍ ఆయిల్‍ (olive oil)తో వంట చేసుకునే వారికి లేదా ఆలివ్‍ ఆయిల్‍ ను ఇతరత్రా శరీరంలోకి తీసుకునే స్త్రీల లైంగిక ఆరోగ్యం మెరుగ్గా వుంటుందని పరిశోధకులు కనిపెట్టారు. అటువంటి వారిలో ఆండాశయ క్యాన్సర్‍ వచ్చే అవకాశం కనీసం ౩౦ శాతం తగ్గుతుంది. ఆలివ్‍ ఆయిల్‍ లో వున్న ఆరోగ్య కారక కొవ్వులు (fats) క్యాన్సర్‍ కారక అంశాలను అణిచివేస్తాయన్నది వారి నమ్మకం.

Desktop Bottom Promotion