Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
హానిలేని గర్భ నిరోధక సాధనం....కుంకుడు కాయ!
జంటలు రతికార్యం చేయాలంటే గర్భం వస్తుందని భయపడుతూంటారు. అందుకుగాను జంటలు ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

కుటుంబ సహకారం - నేటి రోజుల్లో, జంటలు ఏ బాదరబందీ లేకుండా తామిద్దరూ మాత్రమే వేరుగా వుండాలని కోరుతున్నారు. ఈ పరిస్ధితిలో ఆమె గర్భవతి అయితే, తనంతతాను ఆరోగ్య పరిరక్షణ చేసుకోగలదా? బిడ్డ పుడితే ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచగలదా వంటి అంశాలను పరిశీలించాలి. తల్లి తండ్రులవ్వాలనుకునే జంటలకు తమ కుటుంబ సహకారం ఎంతో ప్రధానం. గర్భవతి అయ్యే మహిళ ఎన్నో రకాల మనో భావనలకు గురవుతూంటుంది. అటువంటపుడు ఆమె తల్లి లేక అత్తల సహకారం అత్యవసరమవుతుంది.
ఆర్ధిక పరిస్ధితి - కుటుంబంలోకి బేబీ రాకతో ఆర్ధిక పరిస్ధితి మారుతుంది. మీ ఆర్ధిక పరిస్ధితి ఒక్కసారి సమీక్షించండి. మీ మధ్య ఆర్ధికపర అభిప్రాయ బేధాలు లేకుండా కొనసాగండి. ఈ అంశం నిర్లక్ష్యం చేస్తే అది మీ మధ్య విభేధాలు పెంచే అవకాశం వుంది.
ఈ రకమైన అంశాలను సమన్వయించుకోవటంలో జంటలు ఎన్నో రకాల గర్భ నిరోధక సాధనాలు, మాత్రలు వంటివి వాడుతూంటారు. అయితే ఇటీవల సహజసిద్ధమైన గర్భనిరోధక సాధనంగా కుంకుడు కాయల లేపనం కనుగొనబడింది. గర్భనిరోధ మాత్రలు ముఖ్యంగా హార్మోన్ లకు సంబంధించినవిగా ఉంటాయి. మహిళ గర్భం ధరించాలంటే, అండోత్సర్గం కావాలి. అయితే ఆమెలో అండం ఎపుడు విడుదలయ్యేదీ సరిగ్గా తెలియకపోయినప్పటికి ఈ లేపనాన్ని ప్రతిరోజు యోనిలోపలిభాగంలో రాయటం అనేది చేస్తే, అండం విడుదలైనప్పటికి అందుకు తగిన అనువైన పరిస్ధితులు లేని కారణంగా అది నిర్వీర్యమైపోతుందంటారు నిపుణులు.
తాజాగా చేసిన ఒక పరిశోధనలో కుంకుడుతో చేసిన గర్భనిరోధక లేపనంమంచి ఫలితాలనిస్తున్నట్లు తేలింది. కుంకుడు కాయ శిరోజాలను కాపాడటమే కాదు గర్భనిరోధక సాధకంగానూ ఉపయోగపడుతుందని తేలింది. లక్నోలోని కేంద్ర ఔషధ పరిశోధన సంస్థ (సీడీఆర్ఐ) శాస్త్రవేత్తలు కుంకుడు కాయ నుంచి గర్భనిరోధక లేపనం తయారుచేశారు. దేశీయ కుంకుడుగింజలతో తయారు చేసిన ఈ లేపనం గర్భ రిరోధక సాధనంగా అమోఘంగా పని చేయగలదని భావిస్తున్నారు.
ఈ లేపనానికి 'కాన్‌సాప్' అనే పేరు పెట్టారు. ఈ పూతను యోని లోపలి భాగంలో పూసుకుంటే గర్భనిరోధక సాధనంగా పనిచేస్తుంది. అంతేకాదు... యోని లోపలి భాగంలోని చెడు బ్యాక్టీరియా, ఇతర ఇన్‌ఫెక్షన్‌లను కూడా తొలగిస్తుంది. మంచి బ్యా క్టీరియాను మాత్రం కాపాడుతుంది. ఈ రకంగా మహిళ జననాంగ భాగాల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చు.



Click it and Unblock the Notifications