Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
గర్భ విచ్ఛిన్నం కలిగించే ఆహారాలు?

గర్భ విఛ్ఛిన్నం లేదా అబార్షన్ కలిగించే ఆహారాలు -
1. మీరు చేపలు తినటం బాగా ఇష్టపడేవారైతే, ఈ సమయంలో చేపలు తినటం మానాలి. చేపలు నదులలోని, సరస్సులలోని, కొలనులలోని కలుషితాలతో అనారోగ్యంగా ఉంటాయి. చేపలలో ప్రొటీన్లు, విటమిన్లు ఉంటాయి. కాని జాగ్రత్త కొరకు చేప ఆహారాన్ని పూర్తిగా మానండి. డబ్బాలలో నిలువ ఉంచిన చేపలు కూడా తినకండి. ఇవి నిలువ వుంచటానికి దీనిలో రసాయనాలు అధికంగా వాడతారు. అవి మీ రక్తపోటును పెంచుతాయి. అంతేకాదు, మీ శరీరంలో నీటిని కూడా నిలువ చేస్తాయి.
2. మాంసం లేదా గుడ్లు - వీటిని కూడా జాగ్రత్తగా తినాలి. పచ్చివి అయితే, అసలు తినకండి. ఈ ఆహారాన్ని బాగా వేడిచేసి లేదా ఉడికించి దానిలోని బాక్టీరియా పోయేలా చేయాలి. ఉడికించని కోడి లేదా ఇతర మాంస సంబంధిత ఉత్పత్తులు గర్భవిచ్ఛిన్నానికి తోడ్పడతాయి.
3. గర్భవతికి లిస్టేరియా అనే బాక్టీరియాతో ఏ దశలోనైనా సరే గర్భవిచ్ఛిన్నం జరుగవచ్చు. ఉడికించని మాంసం, కోడి, సముద్రపు ఆహారాలు, ఛీజ్, పాలు, లేదా ఇతర పాల సంబంధిత ఉత్పత్తులలో ఈ బాక్టీరియా ఉంటుంది. కనుక బాగా వేడి చేసిన ఆహారాలుగానే వీటిని తీసుకోవాలి.
4. దిగుమతి చేసుకున్న ఛీజ్ అంటే బ్రీ, ఫెటా, కేమం బర్ట్, రోక్ ఫోర్ట్, మొదలైనవి తినకండి. ఇవి ప్రధానంగా క్రిమి రహితం చేయని పాలతో తయారు చేస్తారు. ఇవి గర్భవతికి హాని కలిగిస్తాయి.
5. మాంసంతో తయారు చేయబడిన లేదా డబ్బాలలో నిలువ ఉంచిన మాంస ఉత్పత్తులు, సీ ఫుడ్లు వంటివి గర్భ విచ్ఛిన్నానికి దోహదం చేస్తాయి. పైన్ ఆపిల్, బొప్పాయి వంటివి తిన్నా కూడా కడుపులో బిడ్డకు ప్రమాదకరంగా ఉంటాయి.
6. గర్భవతి ఏ ఆహారం తిన్నప్పటికి దాని పరిశుభ్రత ప్రధానం. శుభ్రంగా లేని పండ్లు, కూరగాయలు సైతం అబార్షన్ కలిగిస్తాయి. వీటిలో కోలి అనే బాక్టీరియా విషపూరితంగా ఉంటుంది. కనుక పండ్లు, కూరలు వండే ముందు బాగా కడిగి శుభ్రం చేయండి. కేబేజి, కాలీఫ్లవర్ ఆకు కూరలు వంటివి కూడా బాగా కడిగి వండాలి. కూరలను, పండ్లను, వేడినీటిలో కొద్దిపాటి ఉప్పు వేసి కూడా శుభ్రం చేయవచ్చు. తర్వాత వాటిని ఉడికించాలి.
7. చాలామంది ప్యాకెట్లు, డబ్బాలలో ఉంచిన పండ్ల రసాలను, పాల ఉత్పత్తులను తాగుతారు. అయితే, వీటిని క్రిమి రహితంగా చేశారా లేదా అనేది తయారీ దారులు ప్యాకెట్ పై వ్రాస్తారు. వాటిని గమనించి కొనుగోలు చేసి తాగండి. అపుడే అవి ఆరోగ్యకరం గా ఉండి మీకు మీ బిడ్డ పోషణలకు మేలు చేస్తాయి.



Click it and Unblock the Notifications