Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
గర్భ ధారణ లక్షణాలు ఎలా వుంటాయి?

గర్భం ధరించగానే కనపడే లక్షణాలు మహిళ మహిళకు మారుతూంటాయి. ఒకే మహిళకు గర్భానికి మరో గర్భానికి కూడా మారుతూంటాయి. అన్ని లక్షణాలకంటే కూడా ఖచ్చితంగా తెలుపాలంటే అది మహిళకు వచ్చే నెలసరి పిరియడ్ మిస్ అవటమనేది లేదా లేట్ గా రావటమనేది మాత్రమే. మరింత ఖచ్చితంగా తెలియాలంటే గర్భ ధారణ పరీక్ష పాజిటివ్ గా రావటమే. గర్భవతి లక్షణాలు అర్ధం చేసుకోవడం ప్రధానం. ఎందుకంటే ప్రతి లక్షణం కూడా గర్భ ధారణ కాని అంశాలతో కూడా ముడిపెట్టి వుంటుంది. కొంత మంది మహిళలు ఫలదీకరణ లేదా అండోత్సర్గం జరిగిన వారం లోపే లేదా గర్భం ధరించిన వారం లోపే దానిని తెలుసుకుంటారు.
మరికొంతమంది మహిళలలో గర్భధారణ చిహ్నాలు లేదా గుర్తులు ఆలస్యంగా కనపడతాయి.మరికొంతమంది మహిళలలో అసలు చిహ్నాలుకనపడవు, వీరికి పరీక్షల ద్వారానే నిర్ధారించాలి. లక్షణాలు ఎలా వుంటాయంటే? మహిళ శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. పింక్ లేదా బ్రౌన్ రంగులో రక్తస్రావం కొద్దిగా కనపడుతుంది. పొత్తికడుపు కింది భాగంలో నొప్పులు వస్తాయి. ఇవి అండోత్సర్గం జరిగిన 8 లేదా 10 రోజులలో కనపడతాయి. హెచ్ సిజి పరీక్ష మూత్రపు పరీక్షలలో పది రోజులకు తెలుస్తాయి. రెండు నుండి నాలుగు వారాలకు వికారం కలుగుతుంది.
మూడు లేదా నాలుగు వారాలలో స్తనాలు చనుమొనలు మెత్తపడతాయి. 3 నుండి పది వారాలలో అలసట, కలుగుతుంది. 3 నుండి పది వారాలకు వాంతులు అవుతాయి. ఒకటి నుండి రెండు నెలలకు కొన్ని ఆహారాలు అంటే పుల్లటి మామిడికాయ వంటివి తినాలని కోరిక కలుగుతుంది. కొంతమంది మహిళలకు నెలలు నిండి కాన్పు అయ్యే చివరివరకు కూడా డైలీ రొటీన్ లో మార్పు కలగదు. మరి కొంతమందికి మొదటినుండి సమస్యలుగానే వుంటాయి.



Click it and Unblock the Notifications
