Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భార్య గర్భవతి ఐతే వెన్నంటి ఉండే భర్త తెలుసుకోవలసిన చిట్కాలు...

గర్భాధారణ సమయంలో చాలా మంది మహిళలు ఉదయం ఎక్కువగా నీరసంగాను, వామిటింగ్స్ సెన్సేషన్, వికారం లాంటివి ఎక్కువగా బాధిస్తుంటాయి. వామిటింగ్స్ అనేవి వ్యక్తుల మధ్య వ్యత్యాసం ఉంటుంది. కొందరిలో 3నెలల వరకూ ఉంటుంది. అలాగే మొదటి సారి గర్భం దాల్చే స్త్రీలలో ఆందోళన, అనేక సమస్యలు, ప్రశ్నలతో సతమతమౌతుంటారు. కాబట్టి అలాంటి సమయంలోనే భర్త వెన్నంటి ఉండి సరైన జాగ్రత్తలు తీసుకొని తగిన సలహాలిస్తుండాలి. నీకు, నేనున్నాంటూ భరోసాను కలిగించి, ఆమె ఆందోళ చెందుతున్న విషయాలను తెలుసుకొని వాటికి పాజిటివ్ గా సమాధానాలనించి ధైర్యం ఇవ్వాలి. ఆమెను ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. తల్లి ఎంత సంతోషంగా, ఆరోగ్యంగా గడుపుతుందో, దాని మీదనే కడుపులో పెరిగే బిడ్డపై ప్రభావం ఉంటుంది. .
ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌస్టికాహారము అనగా ఎక్కువపాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసము, చేపలు వగైరా ఇస్తుండాలి. గర్భిణీ స్త్రీ మొదటి రెండు మాసాల్లో ఎక్కువగా ఇష్టపడి తినే ఆహారాన్నే చివరి తొమ్మిది నెలల వరకూ అందించ కూడదు. మొదటి ఆరునెలలు .... నెలకొకసారి, ఏడు -ఎనిమిది నెలల్లో నెలకు రెండు సార్లు, తొమ్మిదోనెలలో వారానికొకసారి వైద్యపరీక్షలు అవసరము. గర్భిణి గర్భాధారణ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అందుకోసం ఇతర మహిళల సలహాల మాత్రమే పాటించకుండా, మీకు దగ్గరలో ఉన్న బుక్ సెంటర్స్ లో దొరికే గర్భాధారణకు సంబంధించిన పుస్తకాలను చదవండ వల్ల తెలియని విషయాలను కూడా కొన్నింటిని తెలుసుకోవచ్చు. భర్త ఇటువంటి వాటిల్లో పూర్తి సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. ఆమె తెలియనివి తెలుసుకొని వివారించాల్సిన బాధ్యత భర్తదే...
గర్భాధారణ సమయంలో స్త్రీని ఎక్కువగా బాధించే సమస్యలు, బ్యాక్ పెయిన్, పాదాలు వాపులు. వీటి నుండి బయట పడేందుకు అప్పుడప్పుడు వెన్నుకు సున్నితమైన మర్ధన అవసరం. అలాగే పాదాలను గోరు వెచ్చని నీటిలో ముంచి, ఐదు పదినిమిషాల తర్వాత బయటకు తీస్తుండాలి. గోరు వెచ్చని నీటితో ప్రతి రోజూ స్నానం చేయించాలి. దాంతో తల్లి, బిడ్డకు క్షేమం, సురక్షితం, రిలాక్స్ గా ఫీలవుతారు.
అలాగే ఆమెకు పౌష్టికాహారం అందిస్తుండాలి. ఆమెను సంతోష పెట్టడానికి ఎప్పుడూ చిరుతిండ్లు, పండ్లు, పలహారాలే కాకుండా ఆమెకు ఇష్టమైన పనులను చేస్తూ, ఆమెకు ఇష్టమైన పువ్వులను తెచ్చి ఇచ్చి సర్ ప్రైజ్ చేయాలి. ఆమె ఇంట్లోనే ఉంటూ బోర్ ఫీలవుతుంటే కనీసం వారానికి ఒక రోజు బయటకు తీసుకెళ్ళాలి. ఆమె నడవాడినికి సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ఉండే పార్క్ కైనా, రొమాంటిక్ అవుట్ డోర్ డిన్నర్ కైనా సరే.



Click it and Unblock the Notifications