Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
గర్భస్రావం లక్షణాలు తెలుసుకోండి!

ఫలదీకర చెందిన అండం సరిగ్గా గర్భంలో అభివృధ్ధి చెందలేని పరిస్ధితులలో గర్భస్రావం జరుగుతుంది. అది మీరు చేసిన తప్పులవలన జరుగకపోవచ్చు. గర్భస్రావానికి కొన్ని సార్లు జన్యుపరంగాను, వైద్య పరంగాను కారణాలుంటాయి.మీ సమాచారం కొరకు గర్భస్రావంకు దోవతీసే కొన్ని లక్షణాలను చర్చిద్దాం.
1. పొట్టలో నొప్పులు - గర్భస్రావం అవుతోందనేందుకు మొట్టమొదటి బలమైన కారణం పొట్టలో నొప్పి రావటం. పొట్టలో కనుక, ప్రత్యేకించి, ఒకే వైపున నొప్పి వున్నట్లయితే, తక్షణం మీరు డాక్టర్ ను సంప్రదించండి. చాలారోజులపాటు మీకు వెన్ను నొప్పి కూడా తరచుగా వస్తూంటుంది. పొట్టలో వచ్చే ఈ నొప్పులు మీకు రుతుక్రమంలో వచ్చే నొప్పులవలెనే వుంటాయి. అయితే, మీ పొట్ట నొప్పులు కొన్నిసార్లు ఒక మోస్తరుగా వున్నపుడు భయపడకండి. ఒక మాదిరి నొప్పులనేవి కడుపులో వుండే బేబీ ఎదుగుదలని సర్దుబాటు చేసుకోవటంలో కూడా వస్తాయి.
2. యోని రక్తస్రావం - గర్భవతి మహిళ యోనినుండి రక్తస్రావం అనేది కొద్దిగా, లేదా అధికంగా అయినప్పటికి తరచాగా లేదా అపుడపుడూ అవుతున్నప్పటికి అది గర్భ స్రావానికి మొదటి చిహ్నంగా భావించాలి. రక్తస్రావం లేదా గడ్డకట్టటం వంటివి డాక్టర్ కు వెంటనే తెలియపరచాలి. అయితే, మొదటి త్రైమాసికంలో గర్భంలో వచ్చే మార్పులు లేదా పిండం గర్భంలో నిలుపబడటం వంటి చర్యలుగా కూడా కొద్దిగా రక్తం వచ్చే అవకాశాలుంటాయి.
3. ప్రెగ్నెన్సీ లక్షణాలు అసలు కనపడకుంటే - ఒక తల్లి తన బిడ్డను ఎపుడూ అనుభవించగలదు. ఒక సారి గర్భవిచ్ఛిన్నం జరిగితే, ఆమెకు బిడ్డ లోపల వున్న భావన కలుగదు. తాను గర్భవతిని అన్న భావన కలుగదు. అంతేకాదు, ఆమెలోని స్తనాల ఎర్రదనం, ఇతర లక్షణాలైన ఆకలి, రుచులు తినాలనే కోరికలు అన్నీ పోతాయి. అయితే, ఈ లక్షణాలు కూడా పూర్తిగా ఆధారపడదగినవి కావు. కనుక గర్భస్రావం అనుమానం కలిగితే, డాక్టర్ ను సంప్రదించండి.
4. ముందుగానే కాన్పు నొప్పులు - మీరు రెండో లేదా మూడవ త్రైమాసికంలోనే కాన్పు నొప్పులవంటివి అనుభవిస్తున్నారంటే, మీరు తప్పక డాక్టర్ ను సంప్రదించాల్సిందే.
5. మానసిక ధైర్యం - మహిళ గర్భస్రావానికి గురయితే, ఆమెకు మానసికంగాను, శారీరకంగాను ఎంతో సహకారం కావలసి వస్తుంది. ఎందుకంటే, గర్భస్రావం అనేది ఒక తల్లి తన బిడ్డను కోల్పోయినంత సంఘటనగా వుంటుంది. కనుక గర్భ స్రావం పొందిన మహిళలకు తక్షణ వైద్య సదుపాయం కలిగించటం, ఆమెను ఊరడించడం, ఆమెకు తగిన ధైర్యం చెప్పి ఆ పరిస్ధితినుండి ఆమె కోలుకొనేలా చేయటం వంటివి ప్రతి ఒక్కరూ తమ ప్రధమ కర్తవ్యంగా భావించాలి.



Click it and Unblock the Notifications
