Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
స్త్రీలలో వంధ్యత్వ నివారణకు మార్గాలు
వంధ్యత్వం అనేది మహిళలు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. వంధ్యత్వం మహిళల్లో మహిళల్లో గర్భం పొందే సార్థ్యం లేకపోవడాన్ని సూచిస్తుంది. అయితే వంధ్యత్వం మహిళల్లో మాత్రమే ఉండదు పురుషుల్లో కూడా ఈ పరిస్థి ఉండటం వల్ల మహిళలు గర్భం పొందలేకపోవచ్చు. ఒక జంట రెగ్యలర్ కాంటాక్ట్స్ ఉన్నాకూడా ఒక సంవత్సరంలోపు గర్భం ధరించకపోతే వంధ్యత్వంగా భావిస్తారు. వంధ్యత్వానికి దోహదపడే అంశాలు చాలా ఉన్నాయి . ఇది మీ వయస్సు , ఆహారం , జీవనశైలి , ఒత్తిడి , వైద్య పరిస్థితులు లేదా వృత్తి ఎక్స్పోషర్ వంటివి కారణాల వల్ల కూడా వంధ్యత్వం ఏర్పడవచ్చు. ఇటువంటి పరిస్థితులు మీ మొత్తం ఆరోగ్యం మీద మాత్రమే కాదు, సంతానోత్పత్తినికూడా ప్రభావితం చేస్తుంది.
మేయో క్లినిక్ , యుఎస్ఎ నివేధిక ప్రకారం వంధ్యత్వానికి 40 % నుండి 50% కేసలు మహిళల్లో సమస్యలు కారణంగా ఉన్నాయి. చాలా కేసుల్లో మహిళల్లో వంధ్యత్వానికి జన్యు సమస్యలు , అండోత్సర్గము లోపాలు , హార్మోన్ అసమానతలను , అధిక బరువు మరియు శరీర నిర్మాణ విరిగిన కారణంగా ఉన్నాయి. అటువంటి కేసులకు చికిత్స చేయవచ్చు, ఇతరములు కాదు. ఈ క్లిష్టమైన ప్రపంచంలో వంధ్యత్వానికి చికిత్స చేయించుకోవడం కంటే, మహిళల్లో వంధ్యత్వాన్ని ఎలా నివారించాలో తెలుసుకోవాలి.
మహిళల్లో వంధ్యత్వాన్ని నివారించాలంటే ముందు మీ సమస్యకు గల ముఖ్య కారణం తెలుసుకోవాలి. మహిళల్లో వంధ్యత్వం నివారించడానికి జవాబు తెలుసుకోవాలంటే ఇక్కడ మేము ఇస్తున్న విషయాలను పరిశఈలించాల్సిందే. మహిళల్లో వంధ్యత్వాన్ని నివారించడానికి ఇక్కడ కొన్నిప్రభావవంతమైన మార్గాలున్నాయి....

ఆహారం: మహిళలల్లో వంధ్యత్వ నివారణకు డైట్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పిల్లల కసం ప్రయత్నించేవారు జంక్ ఫుడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ వంటివాటిని పూర్తిగా నివారించాలి . చాలా వరకూ ఈ ఆహారాల్లో సంకలనాలు మరియు సంరక్షణకారులను కలిగి ఉండి , ఇవి మహిళల్లో వంధ్యత్వానికి దారి తీస్తాయి. మహిళల్లో వంధ్యత్వాన్ని నివారించుటకు తాజా పండ్లు మరియు కూరగాయలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.
వైద్య సలహా : మహిళలల్లో మరేదైనా వైద్యపరమైన పరిస్థితులు వంధ్యత్వానికి కారణం అయివుంటే, వైద్యనిపుణుల సలహా తీసుకోవడం ఒక ఉత్తమ మార్గం. మీలో వంధ్యత్వానికి దారితీసే లక్షణాలు ఏవి కలిగి ఉన్నా, వెంటనే మీ డాక్టర్ తో చర్చించడం చాలా అవసరం. ప్రారంభ దశలోనే ఈ సమస్యను చికిత్స తీసుకోవడం వల్ల మహిళల్లో వంధ్యత్వాన్ని నివారించవచ్చు.
మెడికల్ ఫిట్నెస్ : మహిళలల్లో వంధ్యత్వనివారణకు వైద్యపరంగా ఫిట్ గా ఉండటం ఒక ఉత్తమ మార్గం. మీ సంతానోత్పత్తి ని ప్రభావితం చేసే మధుమేహం , థైరాయిడ్ సమస్యలు మరియు హార్మోన్ అసమానతలను వంటి అనేక వైద్య పరిస్థితులు ఉన్నాయి . ప్రారంభ దశలో వీటికి చికిత్స తీసుకొన్నట్లైతే మహిళల్లో వంధ్యత్వ నివారణకు సహాయపడుతుంది.
క్లీన్ హ్యాబిట్స్: మీలో క్లీన్ హ్యాబిట్స్ లేనప్పుడు, అప్పుడు మహిళల్లో వంధ్యత్వాన్ని ఎలా నివారించాలనడంలో ఆశ్చర్యపడే విషయం లేదు. ధూమపానం నిలిపివేయడం, ఆల్కహాల్ మానేయడం మరియు అక్రమ మందులు వాడకాన్ని నిలిపివేయాలి. మహిళల్లో క్లీన్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు వంధ్యత్వాన్ని నివారించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.
ఆరోగ్యకరమైన బరువు : మహిళ్లల్లో ఊబకాయం వంధ్యత్వానికి ప్రధాన కారణాలలో ఒకటిగా భావిస్తారు . ఊబకాయం హార్మోన్ అసమానతలను కారణం అవుతుంది, అది వంధ్యత్వానికి కారణం అవుతుంది. . అనేక పరిస్థిలు పిసిఓఎస్ వంటి సమస్యలు మీరు బరువు తగ్గించుకోవడం వల్ల పరిస్థితి చక్కబరుచుకోవచ్చు. మహిళల్లో వంధ్యత్వాన్ని ఎలా నివారించాలని మీరు తెలుసుకోవాలనుకుంటే, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ఒక ముఖ్యమైన సలహా.
యోగ మరియు వ్యాయామం : యోగ మరియు వ్యాయామం మహిళల్లో వంధ్యత్వాన్ని నివారించేందుకు సహాయపడుతుంది. ఈ రెండు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, మీ మానసిక ఆరోగ్య నిర్వహించడానికి ఉంటుంది . మీలో ఒత్తిడి మరియు ఆందోళలను తగ్గించుకోవడానికి యోగా అద్భుతంగా సహాయపడుతుంది., వ్యాయామం మీరు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.
జీవనశైలి: ఒక ఆరోగ్యకరమైన జీవనాన్ని నిర్వహించడం మహిళల్లో వంధ్యత్వ నివారణకు ఇది చాలా ముఖ్యం. మీ జీవనశైలీ మీ జీవితం మరియు జీవనశైలి గురించి చెబుతుంది . కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించి మహిళ్లల్లో వంధ్యత్వాన్ని ఎలా నివారించబడుతుందో చూడండి.



Click it and Unblock the Notifications