Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల కలిగే భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్..
లేడీస్.. !! చాలామంది మహిళలు.. పెళ్లైన తర్వాత వెంటనే తల్లి కావడానికి ఇష్టపడరు. అలాగే సెక్సువల్ గా యాక్టివ్ గానే ఉంటూ.. ప్రెగ్నెన్సీని ఎవైడ్ చేయాలని భావిస్తారు. అందుకోసం బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ.. గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుందనేది చాలామందికి తెలియదు.
కానీ ఎక్కువకాలం బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ ని కూడా తరచుగా వాడుతూ ఉంటారు. కానీ ఈ రెండింటి వల్ల భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల.. సెక్స్ ఎంజాయ్ చేసి.. పిల్లలు వద్దు అనుకునేవాళ్లకు సహాయపడతాయి.
కానీ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల.. పిట్యూటరీ గ్లాండ్స్ లో ప్రక్రియపై దుష్ర్పభావం చూపుతుంది. ఓవరీలోకి ఎగ్ రిలీజ్ అవకుండా అడ్డుకుంటుంది. ఇలా ప్రెగ్నెన్సీకి దూరంగా ఉండవచ్చు. కానీ వీటిని వాడిన చాలామంది మహిళలు.. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ని ఫేస్ చేశారు. అవి తాత్కాలికమైనవి. అవేంటో చూద్దాం..

ఈస్ట్ ఇన్ఫెక్షన్స్
రెగ్యులర్ గా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం మంచిది కాదు. వీటివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య మొదలై.. వాజినల్ డ్రైగా మారుతుంది. అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కి కారణమవుతుంది.

కళ్లలో సమస్యలు
బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల కంటి సమస్యలు ఎదురవుతాయి. కళ్లు డ్రైగా, దురదగా, బ్లర్ గా మారతాయి. ఇవి శరీరాన్ని కూడా డీహైడ్రేట్ చేస్తాయి.

బ్లడ్ క్లాట్స్
బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల.. అబ్ నార్మల్ బ్లడ్ క్లాట్స్ మహిళల శరీరంలో ఏర్పడతాయి. ముఖ్యంగా స్మోకింగ్ చేసే మహిళలు, అధిక బరువు ఉన్న మహిళల్లో అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

మైగ్రేన్స్
బర్త్ కంట్రోల్ పిల్స్ వాడే కొంతమంది మహిళలు.. మైగ్రేన్ తలనొప్పితో బాధపడతారు. ఇది చాలా కొంతమందిలోనే కనిపిస్తుంది.

ఒత్తిడి
బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల మూడ్ లో మార్పులు వచ్చి.. డిప్రెషన్ కి దారితీస్తుంది. అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య ఉన్న మహిళలు ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తారు.

సెక్స్ సమయంలో నొప్పి
కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం వల్ల కొంతమంది మహిళలు సెక్స్ సమయంలో నొప్పి ఎదుర్కొంటారు. హార్మోన్లు.. పెల్విక్ పెయిన్, డ్రై వాజినాకి కారణమవుతుంది.

సెక్స్ లో సమస్యలు
చాలామంది మహిళలు సెక్స్ పై ఆసక్తి కోల్పోతారు. దీనికి ప్రధాన కారణం.. బర్త్ కంట్రోల్ పిల్స్. ఇది చాలా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్.



Click it and Unblock the Notifications
