Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
అన్నం వద్దు అనే పిల్లలతో.. ఇంకా కావాలి అనిపించే 5 సూపర్ టిప్స్
మా పిల్లలు అస్సలు అన్నం తినరు..ఏది పెట్టినా మొహం తిప్పేస్తారు..ఇవి చిన్న పిల్లలున్న దాదాపు అందరి ఇళ్లల్లో తల్లిదండ్రుల నోట వినబడే మాటలు. పిల్లలు సరిగ్గా తినకపోతే వారి ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన పేరెంట్స్ కి ఉంటుంది.
అయితే 5 ఈజీ టిప్స్ పాటిస్తే మీ పిల్లలు ఇష్టంగా ఫుడ్ తింటారని ఖమ్మంలోని ప్రసిద్ధ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు చెందిన MD పీడియాట్రిక్స్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలిపారు.

పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్ ఇవ్వకూడదు
కొన్ని బిస్కెట్లే కదా, కొన్ని చిప్సే కదా ఏమయిద్దిలే అనుకుంటారు తల్లింద్రులు.కానీ ఆ కొంత జంక్ ఫుడే పిల్లల పొట్ట నింపేసి ఆకలి లేకుండా చేస్తుంది. అందువల్ల పిల్లలు వేరే ఆహారాన్ని తీసుకోడానికి ఇష్టపడరు.
చిరుతిళ్లు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. వీటిలో పోషకాలు శూన్యం, కేవలం అనవసరమైన కేలరీలు, ఉప్పు, చక్కెర మాత్రమే ఉంటాయి. దీనివల్ల అసలైన భోజన సమయానికి పిల్లలకు ఆకలి ఉండదు. పౌష్టికాహారంపై వారికి ఆసక్తి పోతుంది.
ఇంట్లో బిస్కెట్లు, చిప్స్, చాక్లెట్లు, శీతల పానీయాలు వంటివి అందుబాటులో లేకుండా చూసుకోండి. వాటికి బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ అయిన పండ్ల ముక్కలు, పెరుగు, ఉడికించిన శనగలు వంటివి ఇవ్వండి. ఇది వారి ఆకలిని చంపకుండా శక్తిని ఇస్తుంది.
ఆహారాన్ని కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు ఇవ్వాలి
పెద్దల మాదిరిగా పిల్లలు ఒకేసారి కడుపు నిండా తినలేరు. ఎందుకంటే చిన్న పిల్లల పొట్ట చాలా చిన్నగా ఉంటుంది. మనం పెద్ద ప్లేట్ నిండా అన్నం పెట్టి మొత్తం తినాలని బలవంతం చేస్తే వారికి భోజనంపైనే విరక్తి కలుగుతుంది.
పిల్లలకు ఎప్పుడైనా ఆహారాన్ని తక్కువ క్వాంటిటీలో ఎక్కువ టైమ్స్ ఇవ్వాలి. తక్కువ ఆహారం ఇవ్వడం వల్ల సులభంగా జీర్ణమై పిల్లలు మళ్లీ ఆకలేసి మళ్లీ ఫుడ్ కావాలని అడుగుతారు.
ఆహారాన్ని అందంగా అలంకరించి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు
పిల్లలు రంగులు, ఆకారాలను అమితంగా ఇష్టపడతారు. సాధారంగా కనబడే ఇడ్లీ, దోశ, చపాతీ కన్నా కాస్త ఆకర్షణీయంగా అలంకరించిన ఫుడ్ తినడానికి ెక్కువ ఉత్సాహం చూపిస్తారు. అందువల్ల కలర్ ఫుల్ ఫ్లేట్స్ లో ఫుడ్ పెట్టాలి. ఫ్రూట్స్ ని మంచి డిజైన్ గా కట్ చేయాలి.
ఆహారాన్ని మంచిగా అలంకరించి ఇవ్వాలి. ప్లేట్‌లో అన్నంతో స్మైలీ ఫేస్, కూరగాయలతో కళ్లు, ముక్కు పెట్టి అలంకరించండి. కుకీ కట్టర్స్‌తో చపాతీలను, బ్రెడ్ ను, దోశలను నక్షత్రం, పువ్వు, జంతువుల ఆకారాల్లో కట్ చేసి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల భోజనం వారికి ఒక సరదా ఆటలా అనిపిస్తుంది.

ఇంట్లో అందరు పిల్లలతో కలిసి ఆహారం తీసుకోవాలి
పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. మనం సెల్ ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ తింటే వాళ్లూ అదే అలవాటు చేసుకుంటారు. అదే కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం బల్ల దగ్గర కూర్చుని, ఆనందంగా మాట్లాడుకుంటూ తింటుంటే పిల్లలకు భోజన సమయం అంటే ఒక సంతోషకరమైన ఘట్టంగా గుర్తుండిపోతుంది.
మనం ఇష్టంగా కూరగాయలు తింటుంటే చూసి, వారూ వాటిని ప్రయత్నించడానికి ముందుకు వస్తారు. ఇది వారికి మంచి అలవాట్లను నేర్పడమే కాకుండా, కుటుంబ బంధాలను కూడా బలపరుస్తుంది.
పిల్లలను తినమని ఒత్తిడి చేయకూడదు
పిల్లలను ఎప్పుడూ తినాలని బలవంతం చేయకూడదు. మొత్తం తినేయాలి..ఇంకొక ముద్ద తిను అని పిల్లలను ఎప్పుడూ ఫోర్స్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల భోజనం అంటేనే వారికి భయం, ఆందోళన కలుగుతాయి. ఇది దీర్ఘకాలంలో వారి ఆహారపు అలవాట్లపై తీవ్ర నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుంది.
కొద్దిగా తిన్నా కూడా బాగా తిన్నావ్ అని ఎంకరేజ్ చేయండి. వారి ప్రయత్నాన్ని అభినందించండి. వారి ఆకలిని గౌరవించండి. కడుపు నిండితే చాలు అని చెప్పే స్వేచ్ఛను వారికివ్వండి.
పిల్లల భోజనం అనేది తల్లిదండ్రులకు ఒక పరీక్ష కాదు, అదొక క్రియేటివ్, ప్రేమతో కూడిన ప్రక్రియ. డాక్టర్ గౌతమ్ చెప్పినట్లుగా ఒత్తిడి, బలవంతం పక్కనపెట్టి, ప్రోత్సాహం, సృజనాత్మకత, సహనంతో ప్రయత్నిస్తే ఎలాంటి మొండి పిల్లలైనా ఇష్టంగా తినడం ప్రారంభిస్తారు.



Click it and Unblock the Notifications
