Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
30 ఏళ్ల తర్వాత గర్భం కోసం ప్రయత్నిస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లిళ్లే చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. పాతికేళ్లు దాటినా ఏమాత్రం ఆ ఊసు ఎత్తట్లేదు. కెరియర్ పై దృష్టి పెడుతూ.. 30 దాటాకే చాలా మంది వివాహం చేసుకుంటున్నారు. ఇక పిల్లల గురించి ప్లాన్ చేసుకోవడానికి మరికొంత సమయం అంటూ ఆగుతున్నారు.
కానీ ఇదంతా మంచి పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. 30 ఏళ్లు దాటితే గర్భధారణ చాలా కష్టమవుతుందన్నారు. కానీ ఈ చిట్కాలు పాటిస్తే 30 ఏళ్ల దాటిని వారిలోనూ గర్భం సులువుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.

1. మెడికల్ ఇన్సూరెన్స్:
మీకు బిడ్డ పుట్టక ముందే ఆరోగ్య బీమా తీసుకోండి. తద్వారా డెలివరీ తర్వాత ఆర్థిక భారం ఉండదు. డెలివరీ కోసం కొంత డబ్బును కూడా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 30 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా సీ సెక్షన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి.. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ భారం పడదు.
2. శారీరక పరీక్ష చేయించుకోవాలి:
30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తుంటే.. ముందుగా శారీరక పరీక్ష చేయించుకోవాలి. లేదా మంచి గైనకాలజిస్టును కలవాలి. ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల గర్భధారణ అవకాశాలు మరింత పెరుగుతాయి. వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవాలి.
3. ఆలస్యం చేయవద్దు:
మీరు ఒక సంవత్సరం కాలం నుంచి గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నా.. గర్భం దాల్చకపోతే ఇక ఆలస్యం చేయకూడదు. వెంటనే సంతానోత్పత్తి చికిత్స పొందాలి. సంవత్సరాలు గడిచేకొద్దీ.. సమస్య పెరుగుతుంది. బిడ్డ చాలా ఆలస్యంగా జన్మించినట్లయితే ఎగ్ ఫ్రీజింగ్ చేయవచ్చు. డబ్బు సమస్య లేని వారు ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు.
4. మీ బరువుపై శ్రద్ధ పెట్టండి:
మీరు బిడ్డను పొందాలనుకుంటే మీ బరువుపై శ్రద్ధ వహించండి. మీరు లావుగా ఉండి అధిక బరువు కలిగి ఉంటే, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ప్రయత్నించండి. క్రాష్ డైట్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. బదులుగా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించండి.
5.ఈ ఆహారాలు మంచివి:
బీన్స్, తృణ ధాన్యాలు, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, పండ్లు, వెన్న, చీజ్, పెరుగు, చేప, వాల్నట్, గుడ్డు (పచ్చసొనతో) చాలా మంచివి అలాగే రోజువారీ నడక, యోగాసనాలు వేయడం మనిషి ఆరోగ్యాన్ని మరింత బాగు చేస్తుంది.
6.సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి:
కొందరు 30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చేందుకు ప్రయత్నించేటప్పుడు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. 30 ఏళ్ల తర్వాత అండోత్సర్గము తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 35 ఏళ్లు పైబడిన పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండవచ్చు. కొందరికి పీసీఓడీ, థైరాయిడ్ తదితర హార్మోన్ల సమస్యలు ఈ వయసులోనే వేధించడం ప్రారంభిస్తాయి. ఈ కారణాలన్నీ గర్భధారణను కష్టతరం చేస్తాయి. ఏ సమస్య వచ్చినా సానుకూలంగా ఎదుర్కోవాలి. ఈ సమయంలో ఇంట్లో ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. సంతానం లేదని బాధపడే బదులు, అది జరుగుతుందనే ఆశతో కొనసాగండి, తప్పకుండా క్యూట్ బేబీ ప్రెగ్నెన్సీగా మీ ఒడిలో నిండుతుంది.



Click it and Unblock the Notifications
