అందుకే కవలలు పుడతారు.. ఈ రహస్యం తెలియని వారు చాలా తక్కువ..

ప్రెగ్నెన్సీకి సంబంధించిన చాలా అంశాల్లో కవలలది ప్రత్యేకం. కవలలు ఎలా జన్మిస్తారు. కవలలు జన్మించడం వెనక రహస్యమేమైనా ఉన్నదా. దంపతులు కోరుకుంటే కవలలకు జన్మనివ్వొచ్చా. ఇలా కవలల చుట్టూ ఎన్నో ప్రశ్నలు మిస్టరీలు దాగి ఉన్నాయ్. తల్లి గర్భంలో ఒక బిడ్డను మోయడం చాలా కష్టమైన పని అలాంటిది ఒకే సారి ఇద్దరు పిల్లలను తల్లి గర్భంలో మోయడం సాధారణ విషయం కాదు. గర్భిణీలకు కవలలు జన్మించడం పై ముఖ్యమైన విషయాలను మీతో పంచుకుంటున్నాం.

how twins are born what is the secret behind giving birth to twins how twins are formed naturally

తల్లి అండం తండ్రి వీర్యం కిస్తే పిండం ఏర్పడి అది గర్భసంచిలో బిడ్డగ్గా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. కవలల విషయంలో తల్లి నుంచి రెండు అండాలు విడదలైతే కవలలకు అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మహిళలకు రెండు అండాలు ఒకేసారి విడుదలౌతాయ్. అప్పుడు రెండు అండాలకు రెండు వీర్య కాణాలు కలిసి గర్భసంచిలో ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తుంది.

కవలలు శాస్త్రీయంగా జన్మించే అవకాశం ఉందా..?

మందులు ద్వారా, చిట్కాల ద్వారా కవలలను జన్మనివ్వొచ్చని ప్రకటనలు విడుదల చేస్తుంటారు. అయితే అధికారికంగా అలాంటి ప్రస్తుతం మన దేశంలో లేదు. శాస్త్రీయంగా కవలలు జన్మించేందుకు పరిశోధనలు మాత్రమే జరుగుతూనే ఉన్నాయ్.

కవలలు ప్రధాన కారణం

తల్లి పూర్వీకుల్లో ఎవరికైనా కవలలు పుడితే అప్పుడు జీన్స్ పరంగా తల్లికి కవలలు పుట్టే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయ్. తల్లిదండ్రులిద్దరి పూర్వీకులకు కవలలు పుట్టిన చరిత్ర ఉన్నా కవలలు జన్మించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. 30 ఏళ్లు దాటిన మహిళలకు కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు.

ఈ మహిళలుకు కవలలు పుట్టే అవకాశం ఎక్కువ

అధిక బరువుతో ఉండే మహిళలకు కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. వీరిలో ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువ ఉండడం వల్ల ఒకేసారి రెండు అండాలు విడుదలై కవలలకు జన్మనిచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. 5.5 అడుగుల ఎత్తు ఉన్న మహిళలకు కూడా కవలలు పుట్టే అవకాశం ఉన్నట్లు పరిశోధనలు బయటపడ్డాయ్. కానీ వీరికి ప్రీమెచ్యూర్ బేబీలు పుట్టే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇవి తింటే కవలలే..

చేపలు, పాల పదార్ధాలు ఎక్కువగా తీసుకున్నా కవలలు పుట్టే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ఆస్ట్రేలియాల యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు అధికంగా తీసుకున్న మహిళలకు కవలలు జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

కవలల తల్లులు ధన్యులు

కవలలకు జన్మనిచ్చే తల్లులు ఆరోగ్యంగా ఉంటారని, వారి ఆయుర్ధాయం కూడా ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో బయటపడింది. ప్రపంచంలో ప్రస్తుతం 130 మిలియన్ల మంది కవలలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయ్.

Desktop Bottom Promotion