Latest Updates
-
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే!
పిల్లల పట్ల సూపర్ మామ్.....డ్యాడ్... కాకండి!

పిల్లల్ని పెద్దవాళ్ల లాగా, వ్యక్తులుగా భావించాలి. వారి సొంత హక్కులను గౌరవించాలి. పిల్లలు ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారో చెప్పేకంటే ముందు అలా మీరు ప్రవర్తించి చేతల్లో వారికి చూపాలి. మీ పిల్లలతో క్వాలిటీ టైమ్ గడపాలనుకుంటే మీరు మీ సొంత అభిరుచులకు పెట్టే సమయాన్ని కొంత తగ్గించుకోవాలన్న విషయాన్ని మర్చిపోవద్దు. మంచి శ్రోతగా ఉండండి. మీ పిల్లలు చెప్పేది శ్రద్ధగా వినండి. పిల్లలు చెప్పేదేంటిలే వినేది.. అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. మీరు మీ బాల్యంలో ఎలా ఉన్నారో.. ఎలా గడిపారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీ పిల్లలు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
వారిని డామినేట్ చేసే సూపర్ మామ్ లేదా డ్యాడ్ అవ్వాలని ప్రయత్నించవద్దు. అది ఒక అభూత కల్పన. మీరు ఒక సాధారణ వ్యక్తి. మీకంటూ కొంత విశ్రాంతి సమయం కావాలి. అది తప్పక మీకు మీరే కేటాయించుకోవాలి. అపరాధ భావనను వదిలిపెట్టాలి. మీరు మోసే అతి పెద్ద భారమైన మిమ్మల్ని నాశనం చేసే బరువు కూడా అదేనని గమనించండి. మీ పిల్లల్ని ఎలాంటి కండిషన్లు లేకుండా ప్రేమించండి. వాళ్లకు అవసరమైనప్పుడు వారి పక్కన నిలబడి సహకరించండి. అదే రకంగా మీ పనుల్లో వాళ్ల సహకారం కూడా తీసుకుంటూ ఉండండి. క్రమేణా వారు కూడా మీ లాగే భాధ్యతాయుతమైన వ్యక్తులుగా తయారైపోతారు.



Click it and Unblock the Notifications
