లేటు వయస్సులో పిల్లలు పుడితే!

By B N Sharma

చాలామంది స్త్రీలకు ముఫ్పై యేళ్లు పైబడిన తర్వాతే పిల్లలు పుడుతుంటారు. ఈ రకంగా పుట్టే బిడ్డల్లో ఎక్కువగా జన్యు సంబంధిత లోపాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారు సంతానం విషయంలో మరిన్ని జాగ్రత్తలతో పాటు వైద్యులను నిరంతరం సంప్రదించాలని కూడా హెచ్చరిస్తున్నారు.

ఇదేసమయంలో మహిళలు తమ రుతుక్రమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చెపుతున్నారు. ఎందుకంటే.. రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే వారిలో ఒక్కోసారి క్రమం తప్పవచ్చు. అలాంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇలాంటి వారిలో అండాలు 11వ రోజు నుంచి 20వ రోజు మధ్యలో విడుదల అవుతుంటాయి.

అందువల్ల రుతుక్రమాన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుందని, ఈ రోజుల్లోనే భార్యా భర్తలు కలవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెపుతుంటారు. అదేసమయంలో 30 యేళ్ళు దాటిన స్త్రీలకు పిల్లలు పుడితే మాత్రం జన్యు లోపాలు ఉంటాయని వారు చెపుతున్నారు. ప్రధానంగా 30 యేళ్లు దాటిన స్త్రీలకు పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయని కూడా వైద్యులు చెపుతున్నారు.

Story first published: Saturday, November 19, 2011, 16:44 [IST]
Desktop Bottom Promotion