Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
పిల్లలు మిమ్మల్ని ఇష్టపడాలంటే......!

1. మీ బిడ్డ ఎలా వున్నప్పటికి, అతనిని మాటలతో లేదా చేతలతో శిక్షించకండి. ప్రేమగా, శ్రధ్ధగా సలహాలు ఇవ్వాలి. మీకు గల భావాలు వారిని తిట్టటంతో కాకుండా అతి జాగ్రత్తగా తెలియజెప్పాలి. పిల్లలు పెద్దవారయ్యే కొద్ది తల్లితండ్రులు చూపే ప్రేమ, జాగ్రత్తలు వారిని మరింత ఆకట్టుకుంటాయి. ఈ రకంగా వారి మనసులు గెలవటం తేలిక, మంచిది కూడాను.
2. మనమందరం మానవులమే కనుక, తప్పులు దొర్లుతూంటాయి. మీరు చిన్నపుడు పొందిన చేదు అనుభవాలను వారికి వివరిస్తూ వారిలో విశ్వాసం నింపండి. అవసరపడినపుడు సలహానివ్వండి. ఎప్పుడూ సలహాలిస్తుంటే వారు పెడచెవిని పెట్టే ప్రమాదముంది. గతంలో వారు చేసిన తప్పులను గుర్తు చేయటం, ఫిర్యాదుగా చేయటం సరైంది కాదు. ఇలా చేస్తే వారు మరింత మొండిగాను, కోపంగాను తయారయ్యే అవకాశాలున్నాయి.
3. అతని అవసరానికి వారి వెనుక అండగా వుండండి. స్నేహితులుగా వుండండి. ఎన్నో కష్టనష్టాలను చూసిన మీరు వారికి స్నేహితులుగా మద్దతునివ్వాలి. వారిని ప్రోత్సహించండి. మంచి పని చేస్తే ప్రశంసించండి. అది వారిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అంతేకాక, మీ సంబంధాలు వారికి స్ఫూర్తినిస్తాయి.
4. బహుమతులతో మీ బాబు హృదయాన్ని గెలుచుకోండి. ఆశ్చర్యంగా వారికవసరమైన వస్తువులు బహుమానంగా ఇస్తే, వారు చాలా సంతోషంగా వుంటారు. సంబంధాలు తేలికగా వుంటే, దొంగిలించటం, అబ్ద్ధమాడటం, లేదా రహస్యంగా వుండటం వంటివి పిల్లలలో వుండవు.
5. మంచి ఆహారాన్ని అందించటంతో పిల్లలను ఆకర్షించవచ్చు. వారికిష్టమైన ఆహారాలను వారాంతంలో లేదా వారి పుట్టిన రోజునాడు చేసిస్తే లేదా మార్కెట్ నుండి తెప్పించి ఇస్తే, తల్లితండ్రులతో వారు ఎంతో హృదయపూర్వకంగా ప్రవర్తిస్తారు. రుచికరమైన తిండ్లు వారిని మానసికంగాను, శారీరకంగాను మీకు దగ్గర చేస్తాయి.
గతంలో మీరు ఎదుర్కొన్న కష్ట దశలు, చేసిన కష్టమైన పనులు మొదలైనవి వివరిస్తూ వుంటే వారు భవిష్యత్తులో మంచి వ్యక్తిత్వం కలవారుగా కూడా తయారవుతారు. పిల్లలను అతి జాగ్రత్తగా ప్రేమతో పోషించాలి. విలువలు వారిలో నాటాలి. ఇవే మీరంటే వారు జీవితాంతం గుర్తుపెట్టుకొని ఇష్టపడే దానికి మంత్రాలు.



Click it and Unblock the Notifications
