Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
చీకటి పడకుండా ఇంటికి వచ్చేయ్!

వయసు వచ్చిన మీ పిల్ల లేదా పిల్లాడికి కొన్ని నిబంధనలు పెట్టి వాటిని ఆచరించండి. మొదటగా నిబంధనలు పెట్టాల్సిన అవసరం వుందా? అనేది నిర్ధారించుకోండి. చాలామంది తల్లితండ్రులు ఇంటిలో ఒక క్రమశిక్షణ వుండాలని భావిస్తారు. వారికి స్వేచ్ఛ ఇవ్వాలని భావిస్తే...తర్వాత పశ్చాత్తాపమే. వారి టీనేజ్ జీవితంలో సమస్యలు లేకుండా వుండేందుకుగాను, మీరు ఇచ్చే స్వేచ్ఛకు వారుతగినంత భాధ్యతగా వుంటున్నారా అనేది కూడా చెక్ చేయండి
పెట్టే నిబంధనలు సామాన్యమైనవిగా వుండేలా చూడండి. అవి ఆచరించేవిగా మాత్రం వుండాలి. ఈ నిబంధనలు ఏ కారణంగా పెడుతున్నారనేది మీ పిల్లాడికి వివరించండి. వారిని నమ్మటం లేదని మాత్రం చెప్పకండి. కుటుంబంలో అందరితో కలసి సమయం గడపాలనేవిధంగా వారిని నమ్మించండి. అతను ఎక్కడైనా రాత్రంతా వుండాల్సి వస్తే, విషయాన్ని చర్చించి నిర్ణయించండి. ఏదైనా పార్టీలో లేటు లేదా స్నేహితులతో పిక్నిక్ వంటివి సడలించాల్సిందే. పిల్లాడు మీరు పెట్టిన నిబంధనలను ఆచరించటం లేదా? మీరు వారిని కేకలు పెట్టి ప్రయోజనం లేదు. పిల్లలు ఎదురు తిరుగుతారు. వారి వ్యతిరేకతను అణిచే పరిస్ధితి రాకుండానే వారిని మీరు చక్కదిద్దాలి. మగపిల్లలకు ఖచ్చితంగా వుండండి. బాలికలకు ఒక నెలపాటు పార్టీలకు వెళ్ళవద్దని లేదా ఆమెకిష్టమైన విషయాలకు వద్దని చెప్పటం వంటివి చేయాలి. ఈ నిబంధనలు పెట్టేటపుడు సమయాలలో అబ్బాయికి లేదా మీ అమ్మాయికి బేధం చూపకండి. ఇద్దరిని న్యాయంగా చూడాలి.
ఈ రకమైన నిబంధనలు పెట్టి వాటిని ఆచరించేలా చూడండి.



Click it and Unblock the Notifications