Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
వర్షం పడితే ....హాచ్... వేసవి వస్తే వడదెబ్బ!

ఈ సీజనల్ అలర్జీలకు కారణం బయట వుండే పురుగులు లేదా చెట్లు, గడ్డి, పిచ్చి మొక్కలు వంటివి చిన్న చిన్న కణాలను గాలిలోకి తమ ఫలదీకరణకొరకు పంపుతాయి. ఆ గాలిని మనం పీలుస్తూ అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటాం. రోగనిరోధక శక్తి అధికంగా లేని వారికి ఇవి మరింత త్వరగా వ్యాపిస్తాయి. పిల్లలలో రోగ నిరోధక శక్తి తక్కువగా వుంటుంది కనుక వారికి మొదటగా అతి త్వరగా ఈ సమస్యలు వచ్చేస్తాయి.
బయటనుండి వచ్చి శరీరంలో హాని కలిగించే బాక్టీరియాతో శరీర రోగ నిరోధక వ్యవస్ధ పోరాడుతుంది. పోరాటానికి అవసరమైన రసాయనాలు, హిస్టమైన్స్ వంటివి రక్తంలోకి పంపించి శరీరాన్ని కాపాడుతుంది. ఈ రసాయనాలు రిలీజ్ కాగానే పిల్లలలో అలర్జీ లక్షణాలు కనపడుతూంటాయి.
లక్షణాలు కనపడితేనే అది ఏరకమైన అలర్జీ అనేది కనిపెట్టగలము. ఇవి మీరుండే ప్రదేశాలను బట్టి కూడా మారతాయి.
గతంలో పిల్లలకు ఈ అలర్జీలు లేకపోయినప్పటికి అవి సంవత్సరంలో ఏ సమయంలోనైనా రావచ్చు. అయితే సాధారణంగా అవి 10 సంవత్సరాల వయసునుండి మొదలై, వారి 20 ఏళ్ళ వయసు నాటికి అధికం అవుతాయి. అవే లక్షణాలు పెద్దవారైనప్పటికి కనపడుతూంటాయి. ప్రతి సంవత్సరం మీ పిల్లాడు జలుబుకు గురవుతూంటే, అది సీజనల్ అలర్జీగా గుర్తించవచ్చు. దీని లక్షణాలు తుమ్ములు రావటం, ముక్కు దురద, గొంతు మంట, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, దగ్గు గా వుంటాయి.
ఈ లక్షణాలతో బాటు, దురద, నీరు కారటం, ఎర్రటి కళ్ళు కూడా ఏర్పడతాయి. మీ పిల్లవాడు కనుక ఆయాసం, కష్టమైన శ్వాస వంటివి కలిగి కూడా వుంటే, ఈ అలర్జీయే చివరకు ఆస్తమాగా కూడా దోవతీసే అవకాశం వుంటుందని గ్రహించండి.



Click it and Unblock the Notifications