Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
కంటికింపైతే....తినటం తేలికే!

వాషింగ్టన్: మీ పిల్లాడు తిండి తినటానికి విసిగిస్తున్నాడా? ఏది పెట్టినా వద్దంటాడా? ఇటువంటి పిల్లలకు ఆహారం ఎలా తినిపించాలనేది అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ పరిశోధకులు తీవ్రంగా పరిశోధించారు. పెద్దవారికంటే కూడా పిల్లలకు రంగులంటే మహా ఇష్టంట. ఒకే ప్లేటులో కనుక రంగురంగుల ఆహారాలు కంటికింపుగా కనపడుతూంటే, పిల్లాడు పెద్దల చేతులలోని ప్లేట్ బలవంతంగా లాగేసుకుని మరీ తినేస్తాడంటున్నారు.
ప్రత్యేకించి ఆహారం ప్లేటులో ఏడు రకాల ఆహార పదార్ధాలు ఆరు వివిధ రంగులలో వుండాలట. ఇలా వుంటే పిల్లలు ఖచ్చితంగా ఎక్కువ మొత్తం లోనే లాగిచ్చేస్తారట. ఈ పరిశోధన 23 మంది పిల్లల పైనా 46 మంది పెద్దలపైనా చేశారు. పెద్దల తో పోలిస్తే పిల్లలు అతి త్వరగా వివిధ రంగులు, రుచులు వున్న ఆహారాలు తినేయటం మొదలెట్టారట. మరి పిల్లలకొరకంటూ ప్రతిరోజూ ఇన్ని ఐటమ్ లు తయారు చేసి అందరికి తినిపించేస్తే, పెద్దలు, పిల్లలు కలసి ఆపై డైటింగ్ కూడా మొదలుపెట్టాలేమో?
పెద్దలకైనా, పిల్లలకైనా, తినే ఆహారానికి రుచి, వాసన, రంగులు ప్రాధాన్యత వహిస్తాయని అంతేకాక, వాటి సైజు ఆకారాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని రీసెర్చి టీముకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ కెవిన్ నిఫిన్ తెలిపారు. ఈ అంశాన్ని 'ఎక్టా పెడియాట్రికా ' అనే జర్నల్ ప్రచురించింది.



Click it and Unblock the Notifications
