Latest Updates
-
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.!
మీ పిల్లలు పాసివ్ స్మాకర్స్ గా వున్నారా?

1. పిల్లలకు హానికలిగే పాసివ్ స్మాకింగ్ తల్లితండ్రుల కారణంగా వుంటుంది.మీరు వారి ముందు తాగకపోయినప్పటికి, మీరు తాగిన కారణంగా ఏర్పడిన నికోటిన్ వంటివి బాత్ రూమ్ వంటి ప్రదేశాలలో అంటి వుంటాయి. పిల్లలు వాటిని పీల్చినా చాలు హానికరమే.
2.పిల్లలు పెద్దలు ఏం చేస్తే దానిని అనుకరిస్తారు.మీరు సిగరెట్లు పెట్టుకుంటే వారు పెన్ను వంటివి నోటిలో పెట్టుకొని ఆనందిస్తారు. పెద్దవారైన తర్వాత నిజమైన సిగరెట్లు కాలుస్తారు. మరి మీ పిల్లలనుండి ఇటువంటి అలవాట్లు మీరు ఆశిస్తున్నారా?
3. పెద్దలు తాగే సిగరెట్లను పిల్లలు చెడు అలవాటు కాదు అనుకుంటారు. ఇదే రీతిలో పిల్లలు తమ బాల్య దశ నుండే సిగరెట్లకు అలవాటు పడతారు. సిగరెట్ తాగటం ఒక స్టైల్ గా భావిస్తారు.
4. టీనేజ్ వచ్చే సరికి మీ పిల్లవాడు సిగరెట్ తాగటానికి అలవాటు పడిపోతాడు. అటువంటపుడు మీరు అతని ఈ చెడు అలవాటును మాన్పించేందుకు శ్రమపడాల్సి వుంటుంది. మీరు స్మాకర్ అయినపుడు మీ పిల్లలకు ఏం చెపుతారు. డ్యాడీ కి పొగతాటం తప్పుకాదు, మాకు తప్పా? అంటారు. చివరకు మీ సిగరెట్ సైతం తీసుకుని కాల్చే స్ధితికి వస్తారు.
5. పాసివ్ స్మాకింగ్ అనేది మీ పిల్లల ఆరోగ్య సమస్యకు దోవతీస్తుందనేది గ్రహించండి. మీ బిడ్డకు ఆస్తమా, లేదా ఇతర శ్వాససంబంధిత వ్యాధులు వస్తే, దానికి కారణం మీరే అవుతారు.
6. ఒకవేళ మీరు కాక మరొక మీ కుటుంబ సభ్యుడే పిల్లలముందు సిగరెట్ కాలిస్తే, మీరు దానికి తీవ్ర అభ్యంతరం తెలుపాలి. వారితో పూర్తిగా చర్చించండి. ఇంటివద్ద అతడు పొగతాగకుండా చేయండి. మీరు ఆ విధంగా మీ ఇంటిలో లేదా మీ ఇంటి పరిసరాలలో పొగ తాగటం అనేది లేకుండా చేస్తే మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఏ సమస్య వచ్చినప్పటికి సిగరెట్ కారణంగా వారికి ఆ వ్యాధి వచ్చిందనే భావన మీకు కలుగదు. పొగ తాగడం ఆరోగ్యానికి ఎప్పటికి హానికరమేననేది గుర్తించండి. పిల్లలుగా వున్నపుడే వారిలో ఇటువంటి భావనలు రానీయరాదు. వారు రేపటి పౌరులు, మరల రేపు వారు తమ పిల్లలకు మంచి అలవాట్లు చేయాలి అని గుర్తించండి.
ఈ అంశంపై మీకు మరిన్ని చిట్కాలు తెలిస్తే మాకు వ్రాయండి.



Click it and Unblock the Notifications
