Latest Updates
-
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్!
పిల్లలలో మితిమీరిన కేఫైన్ వాడకం ?

ఏమిటి ఈ కేఫీన్ పదార్ధం?
కేఫీన్ అనేది ఒక మత్తుమందు. సహజంగా మొక్కల ఆకులలోను, విత్తనాలలోను ఉంటుంది. దీనిని కృత్రిమంగా కూడా తయారు చేసి ఆహార పదార్ధాలలో కలుపుతారు. కేఫీన్ ను డ్రగ్ అని ఎందుకంటామంటే అది మీ కేంద్రీయ నరాల వ్యవస్ధను ఉత్తేజపరుస్తుంది. మీకు ఉత్సాహం కలిగిస్తుంది. తాత్కాలికంగా మీ ఎనర్జీ స్ధాయి పెంచి, మీ మూడ్ మారుస్తుంది.
నేడు మనం రెగ్యులర్ గా తాగే, కాఫీ, టీ, వంటి పానీయాలు, చాక్లెట్, ఇతర కూల్ డ్రింక్ లు, పెయిన్ రిలీవర్ టాబ్లెట్లు, మరి కొన్ని నిత్యం వాడే మందులలో కూడా ఇది వుంటుంది. దాని సహజ స్ధితిలో కేఫీన్ చాలా చేదు. కాని పానీయాలలో ఆ చేదును పోగొట్టి రుచిగా తయారు చేస్తారు.
టీనేజ్ పిల్లలు కేఫీన్ ను కూల్ డ్రింక్ లు, ఇతర ఎనర్జీ డ్రింక్ లనుండి పొందుతారు. వీటిలో కేఫీన్ మాత్రమే కక, షుగర్, ఇతర రుచి కలిగించే పదార్ధాలుంటాయి. కేఫీన్ శరీరంలో నిల్వ వుండదు. కాని దాని ప్రభావం మీ శరీరంలో షుమారు 6 గంటల వరకు వుంటుంది. చాలామంది కేఫీన్ తమ మానసిక ఉత్సాహం పెంచుతుందని భావిస్తారు. కాని డోసేజీ అధికమైతే, ఆందోళన, కళ్ళు తిరగటం, తలనొప్పి, వంటివి వుంటాయి. సాధారణ నిద్రను కూడా భంగపరుస్తుంది.
కేఫీన్ ప్రభావం వ్యక్తికి వ్యక్తికి మారుతూంటుంది. అధికంగా తీసుకునే వారికి ప్రభావం కూడా తగ్గిపోతూంటుంది. అంటే వారు తదుపరి ప్రభావం కొరకు మరింత అధికంగా తీసుకోవలసి వస్తుంది. కేఫీన్ డీహైడ్రేషన్ కలిగిస్తుంది. మూత్రం అధికం చేస్తుంది. శరీరంలోని కాల్షియం తగ్గిస్తుంది. ఎముకల పటుత్వాన్ని దెబ్బతీస్తుంది. గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కొంతమందిలో మైగ్రేన్ వంటి తలనొప్పులు తగ్గించినప్పటికి మరి కొంతమందికి మరింత నొప్పి కలిగిస్తుంది.
తగిన మోతాదులలో మాత్రమే కేఫీన్ తాగాలని పోషకాహార నిపుణులు చెపుతారు. రోజుకు 200 నుండి 300 మి.గ్రా. లు పెద్దలకు సరిపడే డోస్ గా చెప్పాలి. రోజుకు 100 మి.గ్రా కేఫీన్ తీసుకునే వారు ఇక దానిపై ఆధార పడినట్లే. టీనేజ్ పిల్లలు కేఫీన్ వాడకాన్ని రోజుకు 100 మి.గ్రా. కంటే మించరాదు. పిల్లలైతే మరింత తగ్గించాలి.
కేఫీన్ రోజువారీ తాగే, కాఫీలు, కూల్ డ్రింక్ లు వంటి వాటిలో వుంటుంది కనుక వీలైనంతవరకు పిల్లలకు వీటి వాడకాన్ని తగ్గించాలి.
వీటి వాడకం పెద్దలైనా, లేక పిల్లలైనా సరే క్రమేణా తగ్గించాలి. లేదంటే, తలనొప్పులతో ఇబ్బందిపడే ప్రమాదం వుంది. మెల్లగా వాడకాన్ని నిర్దేశిత 100 మి.గ్రా స్ధాయికి తీసుకు వస్తే, అది మీకు హాని కలిగించకపోవచ్చు. తలనొప్పులవంటివి, అలసట, ఆందోళన వంటివి కలిగించకుండా మీ ఎనర్జీ స్ధాయిలు సాధారణ స్ధితిలో వుంటాయి.



Click it and Unblock the Notifications
