Latest Updates
-
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ!
పిల్లల కలహాలు మంచివే?

ఈ రీసెర్చిలో షుమారు 2000 మంది స్కూలు పిల్లలు పాల్గొన్నారు. వీరి వయసు 11 లేదా 12 సంవత్సరాలుగా వుంటుంది. ఈ రీసెర్చి లాస్ ఏంజెల్స్ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీ సైకాలజిస్టులు నిర్వహించారు. వీరి మేరకు పిల్లలు పెద్దగా అరవటం, ఇతర పిల్లలతో కలహించటం పాజిటివ్ ఫలితాలనిస్తుందని తేల్చారు. శత్రుత్వానికి శత్రుత్వంతో జవాబిచ్చేయటం లేదా పోట్లాటకు ప్రతిగా పోట్లాడేయటం వంటివి పిల్లలలో పరిపక్వత తెస్తాయంటున్నారు. అంతేకాదు, పోట్లాటలు వారిని మరింత గట్టిగా తయారు చేస్తాయని, పోట్లాడని వారికంటే కూడా వీరు అధిక పేరు ప్రఖ్యాతులు కలిగి వుంటారని తెలిపారు.
ఒక పిల్లవాడిని మరో పిల్లవాడు ఇష్టపడక పోట్లాడితే, ఆ పిల్లవాడు కనుక పోట్లాడలేకుంటే, అతని జతగా వున్న మరో పిల్లాడైనా సరే అతని తరపున కలహించటం మంచిదేనంటారు రీసెర్చర్ మెలిస్సా విట్ కో. ఈ రీసెర్చిలోని ఫలితాలకు దేశంలో చాలామంది విద్యావంతులు ఆశ్చర్యచకితులవుతున్నారు. కొంతమంది కలహాలు నెగెటివ్ చర్యలని పూర్తిగా కొట్టిపారేస్తూండగా, మరి కొందరు ఈ ఫలితాల ఆధారంగా వారు విద్యార్ధుల కలహాలను ఎలా పరిష్కరించాలా అనేది సులువు అవుతుందని భావిస్తున్నారు.
పిల్లలలో చిన్నపాటి పోట్లాటలు మంచివేనని అయితే అవి వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించేవరకు పోరాదని రీసెర్చర్లు చెపుతున్నారు. ఈ రకమైన పోట్లాటలు పిల్లలలో వివిధ రకాల అనుభవాలను నేర్పించి వారిని భవిష్యత్తులో గట్టివారిగా తయారు చేస్తాయని, అందుకనే విద్యా సంస్ధలలో ర్యాగింగ్ చేయటం కూడా కొంతవరకు మంచిదేనని అయితే దీర్ఘకాలం పోట్లాడుతూనే వుండటం, వారి పేరు పాడుచేస్తూ వుండటం వంటివి వ్యర్ధమైన పనులని తేల్చారు.
నేటిరోజుల పిల్లలు, ఏ రకమైన పరిస్ధితినైనా సరే ఎదుర్కొనేందుకు అన్నివిధాలా శిక్షణనివ్వబడాలి. విద్యార్ధులకు వివాదాల నిర్వహణలో శిక్షణ నివ్వాలి. విదేశాలలో విద్యార్ధులకు ఇండిపెండెంట్ గా ఎలా వ్యవహరించాలి అనేదానిపై ప్రత్యేక శిక్షణలు మొదలయ్యాయి. కాని మనం మన దేశంలో ఇంకా పిల్లలకు ఇటువంటి శిక్షణనివ్వటం లేదు. వారు మంచిగా వుండాలనే చెపుతున్నామని, పోట్లాటలు వచ్చినపుడు పిల్లలు, తమలో తాము మధనపడుతూ వుండిపోవటం మంచిది కాదని, హేతువాదబద్ధంగా పిల్లలు ఒక మంచి మార్గంలో తమ నిరసన చూపే శిక్షణ పొందాల్సిన అవసరం వుందని విద్యావేత్తలు చెపుతున్నారు.



Click it and Unblock the Notifications
