Latest Updates
-
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి!
తల్లులూ పోటీ పడకండి....?

ఈ పోటీ భావన, అధికం అయితే, ఎన్నో సమస్యలు వస్తాయి. పిల్లలను పెంచేటపుడు ఎల్లపుడూ ఇతర పిల్లలతో తల్లులు పోలుస్తారు. వారి శారీరక సౌష్టవం నుండి వారి తెలివితేటలు, స్కూలు విద్య, దుస్తులు, ఎన్నో అంశాలు తల్లులు పోలిక పెడతారు. అయితే ఈ రకమైన పోలిక పోటీ తత్వం అనేది పిల్లలలో వారికి తెలియకుండానే అధిక ఒత్తిడి కలిగిస్తుంది. చివరకు అది వారి స్కూలు విద్యలోనే కాక వారు ప్రతిరోజూ పనిచేసే చర్యలలోకి కూడా వస్తుంది. కనుక చిన్నతనంనుండి పిల్లలకు ఒత్తిడి ఉండరాదంటే తల్లులు, వారి విద్యా బుద్ధులను ఇతర పిల్లలతో వారిముందు పోల్చరాదు. చూడు ఆ పిల్లాడు ఎంత బాగా చదువుతున్నాడో,? లేదా ఎంత బాగా ఆడుతున్నాడో, లేదా ఎంత బాగా దుస్తులు ధరించాడో మొదలైన అంశాలు పిల్లలకు చెప్పరాదు.
- పిల్లల అభివృధ్ధి అనేది వారి వ్యక్తిగత సామర్ధ్యానికి ముడిపడి ఎవరికి ఎంత వుండాలో అంతవుంటుందనేది గుర్తించండి. ప్రఖ్యాత సైంటిస్టు ఐన్ స్టీన్ తన నాలుగవ ఏట వరకు మాటలు నేర్చుకోలేకపోయాడు. కనుక తెలివితేటలు కొలిచేందుకు ఏ రకమైన కొలతలు లేవని గ్రహించండి.
- తల్లి లేదా తండ్రి గా పోటీ తత్వం కలిగి వుండకండి. తల్లి అవటం రేసులలో పాల్గొనటానికి కాదు. అది ఒక భాధ్యత, ప్రేమను ఆచరించాల్సిన ఒక వృత్తి.
- ఒక వేళ మీరు కనుక మీ చుట్టూ తల్లులను కలిగి వుంటే, వారంతా ఎంతో సమర్ధవంతులని భావించండి. వారికిగల అంశాలన్నీ మీ తలపైకి ఎత్తుకొని భారం వహించకండి.
- ఒకవేళ మీరు పోటీ పడినా, అధికంగా ప్రేమ చూపే తల్లులతో పోటీ పడండి కాని, చిన్నపాటి పోటీలకు పిల్లలను నిందించకండి. పిల్లలలో ఎవరి సమర్ధత ఏ వయసులో వుండాలో ఆ వయసులో వుంటుందని గ్రహించండి. కొంతమంది చిన్న వయసులోనే ఎంతో తెలివితేటలు చూపిస్తే, మరికొంతమంది, వయసు వచ్చిన తర్వాత వారి సత్తా ఏమిటో చూపిస్తారు. కొంతమంది పిల్లలు కొన్ని రంగాలలో నిపుణులైతే, మరి కొందరు మరి కొన్ని రంగాలలో నిపుణులుగా వుంటారు. కనుక ఎట్టి పరిస్ధితులలోను పిల్లలను వారితోటి ఇతర పిల్లలతో పోల్చి కించ పరచకండి.
- పిల్లలను పెంచటం మీ తల్లి తండ్రుల నైపుణ్యానికి పరీక్షకాదనేది గుర్తించండి. మీ బిడ్డ ప్రపంచాన్ని ఎదుర్కొనటానికి పెరుగుతున్నాడు. అది కూడా తన స్వంత తెలివితేటలతో, సమర్ధలతో తనంతట తాను ప్రపంచాన్ని ఎదుర్కొంటున్నాడని గ్రహించండి.



Click it and Unblock the Notifications
