Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
కుటుంబం కలహిస్తే...పిల్లలు నేర్చుకుంటారు!

బిడ్డప్రవర్తనకు కుటుంబంలోని పరిస్ధితికి నేరుగా సంబంధం వుంది. ఈ అంశంపై రీసెర్చరు సుమారు 251 కుటుంబాలనుండి పిల్లల ప్రవర్తన పరిశీలించారు. పిల్లల కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్కూల్ స్నేహితులుమొదలైనవారిని సర్వేలో ప్రశ్నించారు. వీరిలో 15 మంది పిల్లలు పోట్లాటలు పెట్టుకునే స్వభావంగాను మరో ఇద్దరు మరింత తీవ్ర కొట్లాటలు పెట్టుకునేవారిలాగాను కనుగొనబడ్డారు. ఈ పిల్లల కుటుంబ చరిత్రలు పరిశీలిస్తే కుటుంబ కలహాల కారణంగా పిల్లలు ఈ రకమైన కలహాలు చేస్తున్నట్లు తేలింది.
కలహించే కుటుంబాలలో పిల్లలు ఉండటానికి ఇష్టం చూపకపోవటం, అయిష్టంతో తాము కూడా మొండివారిగా తయారవటం, కనపడిన వారితో పోట్లాటలు అకారణంగా పెట్టుకోవడం వంటివి చేస్తున్నారట. పెద్దలు చేసే ఈ కలహాల వలన వారి విద్యా ప్రగతి కూడా కుంటుపడుతోందట. విద్యలేని పిల్లలు మొండివారుగా తయారవుతున్నారు. సమాజం పట్ల కూడా వారు ఇదే తీరు ప్రవర్తిస్తున్నారు. వీరి స్నేహితులుపై సైతం జగడాలమారి పిల్లల ప్రభావం బాగా వుంటోందని కూడా రీసెర్చర్లు తెలుపుతున్నారు.
దీనికి పరిష్కారంగా పెద్దలు తమ మధ్య భేధాభిప్రాయాలున్నప్పటికి వాటిని పిల్లలముందు ప్రదర్శించరాదు. పిల్లలకు ప్రవర్తనా సమస్యలు తేలికగా అలవడతాయి. వారెంతసేపూ పెద్దలను అనుకరిస్తూంటారు. పెద్దలు సరళంగా వుంటే వారు సరళప్రవర్తన నేర్చుకోవడం. పెద్దలు కలహించుకునేవారైతే అదే రీతిలో పిల్లలు కూడా కలహించటం చేస్తారు. పెద్దలు పిల్లలకు అన్ని రకాలుగా ఆదర్శంగా వుండాలి. నేటి పిల్లలే, రేపటి పౌరులు. పిల్లలుగా వున్నపుడే, కలహించేవారైతే, పెద్దవారయి కూడా వారు సమాజంలో చెడుపేరు తెచ్చుకుంటూ, సమస్యలు తెచ్చుకుంటారు. కనుక పిల్లల తల్లితండ్రులు, వారి పిల్లల ముందర ఏ రకమైన వివాదాలు, లేదా పోట్లాటలు జరుగకుండా చూసుకోవాలి. తల్లి లేదా తండ్రి తమ పిల్లలకు సరైన రీతిలో పనులు కేటాయించకపోవడం కూడా వీరి కలహాలకు కారణమవుతోందని రీసెర్చర్లు తెలపుతున్నారు.



Click it and Unblock the Notifications
