Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
ఎదిగే పిల్లలకు ఎటువంటి ఆహారం ఇవ్వాలి
పిల్లలకు అన్నం తినిపించడమంటే... పేద్ద పని. చందమామను చూపుతూ తినిపిస్తే వెంటనే తినేయడానికి ఇప్పటి పిల్లలు అమాయకులు కాదు. తినడం ఎలా ఎగ్గొట్టాలో వాళ్లకు బాగా తెలుసు. ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఓ ఎత్తై అల్లరి పిల్లలకు అన్నం తినిపించడం మరో ఎత్తు. ఏదో టైమ్‌కు తినిపించాలి కాబట్టి బలవంతంగా పిల్లల నోట్లో పెట్టేస్తుంటాం. కానీ ఎలాంటి ఆహారం పిల్లలు ఇష్టంగా తింటారు? పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏయే ఆహారం ఎంత మోతాదులో ఇవ్వాలి? నిపుణుల సూచనలు మీకోసం.

ఎదిగే పిల్లలకు సంపూర్ణ సమతుల ఆహారం తప్పనిసరి. అందుకే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు, విటమిన్స్, మినరల్స్, నీరు ఇలా అన్నీ తగిన మోతాదులో కలిపిన పౌష్టికాహారం ఇవ్వాలి. రైస్, బ్రెడ్, చపాతీ, ఇడ్లీ లాంటివి తినిపించాలి. తప్పనిసరిగా పండ్లు, తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఇక పప్పు ధాన్యాలు, మాంసం కూడా పెట్టాలి. పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా ఇవ్వాలి. మినరల్స్‌తో కూడాని కొవ్వు పదార్థాలు, స్వీట్స్ తినిపించాలి. రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లను తప్పనిసరిగా తాగించాలి. ఇవన్నీ తగిన మోతాదుల్లో తీసుకోవడంవల్ల పిల్లలలో ఎదుగుదల బాగుంటుంది.



Click it and Unblock the Notifications
