హాని కలిగించే ఆట వస్తువులు!

By B N Sharma

High-tech toys cause injuries to kids
అధునాతనంగా వస్తున్న హై టెక్ ఆట వస్తువులు, ఐ ఫోన్లు, ఐ ప్యాడ్లు వంటి వాటిని పిల్లలకు కొనిస్తున్నారా? జాగ్రత్త సుమా! ఈ రకమైన ఆట వస్తువులు పిల్లలకు హాని కలిగిస్తున్నాయి. బెణుకులు, చేతి మణికట్టు నొప్పులు, మెడ నొప్పులు మొదలైనవి ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు కలిగిస్తున్నాయని నిపుణులు చెపుతున్నారు.

పెద్దలు కంప్యూటర్లపై కూర్చుని పని చేసేటపుడు ఏ రకమైన సమస్యలు వస్తాయో, అటువంటివే అతి తీవ్రంగా పిల్లలకు కూడా వస్తున్నాయని ప్రత్యేకించి పిల్లలకు ఎనిమిదేళ్ళ లేత వయసులోనే మణికట్టు, మోచేయి, మెడ బిగుసుకుపోవడం, భుజాలు, నొప్పి పెట్టటం, తలనొప్పులు వంటివి అధికంగా వస్తున్నట్లు ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. వీటికి కారణం వీరు అధికంగా ఆ వస్తువులతో ఆటలాడటమేనట.

స్కూళ్ళు సైతం మానేసి వీటిపై కూర్చుని ఆడుతూంటే, వీరికి శాశ్వతమైన కండరాల నొప్పులు, మైగ్రేన్ వంటి తలనొప్పులు కూడా వస్తాయట. కుర్చీలలో కూర్చొటం, తమ మెదడుకు ఆటలాడటం ద్వారా తీవ్రమైన ఒత్తిడి కలిగించటంతో చిన్నతనంలోనే వీటి ప్రభావం అధికంగా వుంటోందని రీసెర్చర్ డా. ఎర్నీ తెలిపినట్లు హెరాల్డ్ సన్ పత్రిక ప్రచురించింది.

Story first published: Tuesday, January 31, 2012, 10:02 [IST]
Desktop Bottom Promotion