Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఇంట్లో పిల్లలు చదవాలంటే!

ముందుగా వారి చదువుకుగాను ఒక ప్రత్యేక గదిని కేటాయించండి. ఆ గదిలో ఫోన్లు, టెలివిజన్లు, ఆహార పదార్ధాలు, లేదా కంప్యూటర్లు, ఆటలకు సంబంధించిన ఇతర వస్తువులు వంటివి లేకుండా చూడండి. ఈ వస్తువులన్ని వారి చదువుకు ఆటంకం కలిగిస్తాయి. గోడకు ఒక వైట్ బోర్డు తగిలించండి. ఆరోజు వారు చదవాల్సినవి, వ్రాయాల్సినవి అందులో రాయండి. స్కూలుకు అవసరమైన చదువు, ఇంటిలో ప్రత్యేకంగా వారు నేర్చుకొనే కొత్త విషయాలు విడి విడిగా వ్రాయండి. వారికి సౌకర్యమైన ఒక కుర్చీ, గట్టి టేబుల్ ఇవ్వండి. దీనితో వారి మైండ్ లో ఆనందంగా చదవాలనే కోర్కె పుడుతుంది.
పిల్లల వయసుకు తగిన చదువుకునే వస్తువులే వారికి అందించాలి. మీ బాబు లేదా పాపకు రోజూ ఒకటి లేదా రెండు గంటలు బోధన చేయటానికి గాను ఇంటివద్దే ఒక మంచి అనుభవజ్ఞుడైన బోధకుడిని నియామకం చేయండి. దీనితో మీరు పిల్లలకు సమయం కేటాయించకపోయినప్పటికి వారికి ఇంటిలో మంచి శిక్షణ లభిస్తుంది. వారు నేర్చుకోవలసిన అంశాలపై పుస్తకాలు, లేదా ఇంటర్నెట్ సాధనాలవంటివి వారికి అందుబాటులో వుంచండి. అన్నిటిని మించి ప్రతిరోజూ వారికి చదువుకునేందుకు ఒక సమయాన్ని నిర్ణయించి వారు దానిని ఆచరించేలా పర్యవేక్షించండి.



Click it and Unblock the Notifications
