Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
పిల్లలకు టైమ్స్ సెన్స్ నేర్పించడం ఎలా...

స్కూల్ కి వెళ్లడానికి మీ పిల్లలు పదే పదే లేట్ చేస్తుంటే వారి మనస్తత్వాన్ని పరిశీలించండి. ఏ విషయం వారిని డల్ గా మారుస్తుందో తెలుసుకొని, టీచర్లో మాట్లాడి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి. సమయపాలన కచ్చితంగా చేయాలని త్వర త్వరగా స్కూల్ కి లాక్కెళ్లాలనే ప్రయత్నం చేయకండి ఈ పద్దతి పిల్లలను మానసికంగా ఒత్తిడికి లోనుచేస్తుంది. అంతే కాదు ఆ టైమ్ లోనే లేట్ అవడం వల్ల కలిగే నష్టం ఏంటో చెప్పాలని అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వడం, శిక్షించడం తగదు.
చిల్డ్రన్ కి టైం సెన్స్ ఉండదు. పిల్లలు టైం టేబుల్ ఫాలో అవరు. టైం షెడ్యూలే ఉండదు. పొద్దున్నే నిద్ర లేపుతుంటే ఇంకాసేపు పడుకుంటామంటారు. పిల్లలు స్నానం త్వరగా చేయరు. టిఫిన్ వేగంగా తినరు. స్కూల్ బస్సో, ఆటోనో ఇంటిముందు నిలబడి హారన్ కొట్టేదాకా చిల్ద్రెన్ లో చురుకూకరుకూ ఉండదు. సాయంత్రమూ అంతే. పిల్లలు కాస్త ఏదో తిని ఆటలకు వెళ్ళి ఒకపట్టాన ఇంటికి రారు. హోంవర్క్ ఎంతకూ పూర్తి చేయరు.
చిల్డ్రన్ కి టైం సెన్స్ లేకపోతే కష్టం కనుక సెన్స్ ఆఫ్ టైం గురించి నేర్పించాలి. టైం ఈజ్ మనీ అని, టైం ఈజ్ ప్రేషస్ అని పిల్లలకు అర్ధం చేసి చెప్పాలి. చిల్డ్రన్ ఒకసారి టైం ఈజ్ మనీ అని, టైం ఈజ్ ప్రేషస్ అని గుర్తించి, టైం వాల్యూ తెలుసుకుంటే నెమ్మదితనాన్ని, బద్ధకాన్ని వదిలేస్తారు. వేగాన్ని పెంచుకుంటారు. ఏ పని అయినా వెంటనే చేయడం అలవాటు చేసుకుంటారు.
పిల్లలకు ఒక టైం టేబుల్ రాసివ్వాలి. లేదా పొద్దున్నుంచీ, రాత్రిదాకా చేయాల్సిన పనులేంటో గుర్తుచేసుకుని టైం టేబుల్ తయారు చేయమని చెప్పాలి. చిల్డ్రన్ టైం టేబుల్ ను చిల్ద్రన్ రూంలో కనిపించేలా గోడకు అంటించాలి. ఏ పని ఎప్పుడు, ఎంత టైము అనేది - టైం షెడ్యూల్ చేయమనాలి. టైం వాల్యూ తెలియజేసి, టైం ఈజ్ మనీ అని, టైం ఈజ్ ప్రేషస్ అని చిల్డ్రన్ కు పదే పదే చెపుతుంటే పిల్లల్లో తప్పకుండా మార్పు వస్తుంది. టైం వాల్యూ తెలుసుకుంటారు. టైం టేబుల్ పాటిస్తారు.
చిల్డ్రన్ కు తప్పకుండా టైం సెన్స్, టైం వాల్యూ నేర్పాల్సిందే. వేగం పెంచుకుని షెడ్యూల్ టైం కి పనయ్యేలా చూడాల్సిందే. అయితే మరీ మిలటరీ డిసిప్లిన్ మంచిది కాదు. అలాగని టైం వాల్యూ తెలీకుండా, టైం సెన్స్ లేకుండా ఇండిసిప్లిన్ గా పెంచడమూ మంచిది కాదు. మంచిగా, నెమ్మదిగా చెప్తూ చిల్డ్రన్ను మన దారిలోకి తెచ్చుకోవాలి.



Click it and Unblock the Notifications
