Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పిల్లల్లో అధికబరువు నివారణకు ఆహార చిట్కాలు!

పిల్లల్లో అధిక బరువు ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. టైప్ 2 డయాబెటీస్, గుండెజబ్బులు, నిద్ర లేమి మొదలైన వ్యాధులు వస్తాయి. అధిక బరువు అంటే శరీరంలో అనవసరమైన కొవ్వు కణాలు బాగా పెరిగిపోవటం. పిల్లల అధిక బరువు సమస్యను పరిష్కరించటం చాలా కష్టం. ఆహారం సరిగా తీసుకోకపోవడం, అనారోగ్య జీవన విధానం, తిండి అలవాట్లు, వంశపారంపర్యత మొదలైనవి పిల్లల్లో గల అధిక బరువుకు కారణాలుగా చెపుతారు. అయితే, ఒక ఆరోగ్యవంతమైన పోషకాహార ప్రణాళిక పిల్లలలోకల ఈ అధికబరువు సమస్యను పరిష్కరించగలదు. కొన్ని పద్ధతులు పరిశీలించండి.
1. మొదటగా మీ పిల్లవాడిని డాక్టర్ చే పరీక్ష చేయించండి. లావెక్కడానికి గల కారణాల పరీక్షా నిర్ధారణ చేయండి. అతనికి గల అధిక బరువు వంశానుగతమా? లేక అతని శరీర తత్వమా? అనేది తెలుసుకోండి.
2. బరువును తగ్గించే ప్రణాళికను తయారు చేయండి. ప్రస్తుత బరువు చూడండి. పిల్లాడి ఎత్తును బట్టి అతను ఎంత బరువు వుండాలో నిర్ధారించండి.
3. ఆటపాటలు పిల్లల్లో అధికబరువు తగ్గించటానికి సహకరిస్తాయి. పిల్లాడు ముద్దపప్పులాగా ఇంటిలో కూర్చొని టివిలోని కార్టూన్లు చూడకుండా చక్కటి ప్లే గ్రౌండ్ లో బయట ఆటలాడేందుకు ప్రోత్సహించండి. అరబిక్ వ్యాయామాలైన వాకింగ్, జంపింగ్, రన్నింగ్, సైకిలింగ్, స్విమ్మింగ్ వంటివి ప్రోత్సహించండి.
4. పిల్లాడి ఆహారంలో ఫాస్ట్ ఫుడ్ లేకుండా చూడండి. ఫ్రెంచి ఫ్రైస్, హాంబర్జర్స్, చిప్స్, ఫ్రైడ్ చికెన్, మిల్క్ షేక్స్ మొదలైన కొవ్వు వున్న పదార్ధాలు తిననీయకండి. ఇవన్నీ తర్వాతి దశలో గుండె జబ్బులు తెచ్చే ప్రమాదం వుంది.
5. కార్బన్ కల కూల్ డ్రింకులు పట్టకండి. వీటికి పోషక విలువలు లేకపోగా శరీరానికి కొవ్వు చేర్చే గుణం వుంది.
6. తియ్యగా వున్న డ్రింకులు అంటే జ్యూసులు, ఫ్లేవర్డ్ మిల్క్ కూడా ఇవ్వకండి. తక్కువ కొవ్వు వున్న పాలను మాత్రం ఇవ్వండి.
7. తక్కువ కేలరీలు, కొవ్వు వున్న పాల ఉత్పత్తులను ఇవ్వండి.
8. ఎక్కువ సార్లు గా కొద్దిపాటి ఆహారాన్ని ఇస్తూ వుండండి. పిల్లాడు ఆకలితో వుంటే ఆరోగ్యకరమైన తిండి పదార్ధాలనే ఇవ్వండి. వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్ వంటివి పిల్లలకు చాలా మంచిది.
9. లావుగా వున్న పిల్లలు డిప్రెషన్ లో వుంటారు. కనుక వారిపట్ల మీ ప్రేమను, శ్రధ్ధను కనబరచండి, లావు తగ్గేటందుకు చేసే ప్రయత్నాలు తెలుపండి. అతడు మీతో సహకరించి ఉత్సాహంగా పాల్గొనేలా చేయండి.
10. కంప్యూటర్ గేములు, టివి మొదలైన కూర్చుని ఆనందించే వాటిని నియంత్రించండి. పిల్లాడిని ఎపుడూ శారీరక శ్రమ కలిగే ఆటలకు, వెయిట్ తగ్గించే చర్యలకు ప్రోత్సహించండి.



Click it and Unblock the Notifications