Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పిల్లలలో రోగ నిర్ధారణలు చేయటం ఎలా?

రక్త పరీక్షలు - రక్త పరీక్షలు సాధారణంగా హాస్పిటల్ లేదా లేబరేటరీలలో శిక్షణపొందిన టెక్నీషియన్లు వున్నచోట చేస్తారు. కొద్ది పాటి రక్తం పరీక్షలకు చాలనుకున్నపుడు ఒక చిన్న సూది ద్వారా పిల్లాడినుండి బయటకు తీస్తారు. బ్లడ్ శాంపుల్ ఎక్కువగా కావలసివస్తే, టెక్నీషియన్ పిల్లవాడి చర్మాన్ని శుభ్రపరచి చేతి ముందుభాగం నరం నుండి సూదితో తీస్తాడు. పిల్లలలో కొన్ని మార్లు ఒకసారికంటే అధికంగా తీయాల్సి వుంటుంది. బ్లడ్ శాంపిల్ తీసిన తర్వాత సూది తొలగించినపుడు రక్తం ఆగటానికిగాను కాటన్, లేదా దూది లేదా బ్యాండేజి వంటివి ఉపయోగిస్తారు.
పిల్లలకు రక్తపరీక్షలంటే భయంగా వుంటుంది. కనుక ఈ ప్రక్రియలో పిల్లవాడిని మీరు సముదాయించాల్సివుంటుంది. పిల్లవాడి చేతిని పట్టుకోవడం లేదా వాడి చేతికి ఒక బొమ్మ వంటిది ఇచ్చి గట్టిగా పట్టుకోమనాలి. కొంచెం నొప్పి వుంటుందని ముందుగా తెలుపండి. వెంటనే అయిపోతుందని తెలుపండి. మరీ చిన్న పిల్లలైతే, రక్తం శాంపిల్ తీసే ఈ సమయంలో ఒక పాట పాడటం, లేదా అక్షరాలు పలకటం లేదా నంబర్లు లెక్కించడం వంటివి చేయాలి.
వీరికి పూర్తి బ్లడ్ కౌంట్ కూడా తీస్తారు. దీనిలో వివిధ రకాల రక్త కణాలు లెక్కించబడతాయి. ఇన్ఫెక్షన్లు, జబ్బులు వంటివి సోకినపుడు ఈ బ్లడ్ కౌంట్ ఉపయోగిస్తుంది.
బ్లడ్ కెమిస్ట్రీ టెస్ట్ - ఈ రక్త పరీక్షలో ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం ల స్ధాయి ఎలా వుందనేది చూస్తారు. కిడ్నీ పని ఎలాగుంది, డయాబెటీస్, మెటబాలిక్ సమస్యలు, టిష్యూ డేమేజీ వంటివి కూడా పరీక్షిస్తారు.
బ్లడ్ కల్చర్ - అధిక జ్వరం, చలి వున్నపుడు డాక్టర్ బాక్టీరియా లనుమానించినపుడు ఈ పరీక్ష చేస్తారు. ఏ రకం క్రిమి ఇన్పెక్షన్ కలిగిస్తోందనేది దానిని ఎలా చికిత్స చేయాలనేది దీనిలో తెలుస్తుంది.
లీడ్ టెస్ట్ - 1 నుండి రెండు సంవత్సరాల పిల్లలకు రక్తంలో సీసం కొరకు ఈ పరీక్ష చేస్తారు. పెయింట్ లో వుండే సీసం పీలిస్తే వారికి సమస్యలు వస్తాయని ఈ పరీక్ష నిర్వహిస్తారు. సీసం అధికంగా వుంటే, పొట్ట సమస్యలు, తలనొప్పి, బిడ్డ ఎదుగుదల సమస్యలు వుంటాయి.
లివర్ ఫంక్షన్ పరీక్ష - లివర్ ఎలా పనిచేస్తోంది? డ్యామేజీ, మంట మొదలైనవి కలిగి వున్నాయా? వైరల్ వ్యాధులు, కామెర్లు వంటి వాటిచిహ్నాలకొరకు, ఇతర ఆరోగ్య సమస్యలకు ఈ పరీక్ష చేస్తారు.



Click it and Unblock the Notifications